- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చదివిన బడిలో మళ్లీ కలిసిన స్నేహితులు..
by Kodari Anjali |
ఎన్నో ఏళ్ల క్రితం ఒకే బెంచిపై కూర్చొని విద్యను అభ్యసించిన స్నేహితులు మళ్లీ అదే పాఠశాల ఆవరణలో కలుసుకుని ఆనందాన్ని పంచుకున్నారు.

X
దిశ, ఊట్కూర్: ఎన్నో ఏళ్ల క్రితం ఒకే బెంచిపై కూర్చొని విద్యను అభ్యసించిన స్నేహితులు మళ్లీ అదే పాఠశాల ఆవరణలో కలుసుకుని ఆనందాన్ని పంచుకున్నారు. జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 2000–2001 విద్యా సంవత్సరానికి చెందిన పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తమ విద్యార్థి దశలోని అనుభవాలు, ఉపాధ్యాయుల బోధన, పాఠశాలలో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ ఆ రోజులను మరోసారి ఆస్వాదించారు. చాలా కాలం తర్వాత కలుసుకోవడంతో ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని స్నేహబంధాన్ని మరింత బలపరిచారు. తమను తీర్చిదిద్దిన పాఠశాల పట్ల కృతజ్ఞతగా ఒక బీరువాను విరాళంగా అందజేశారు. పూర్వ ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Next Story






