- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మైసమ్మ జాతరలో దొంగతనం.. పట్టుకున్న ఆలయ సిబ్బంది
by Kodari Anjali |
మైసమ్మ దేవత జాతరలో దొంగల నుంచి ఆలయ సిబ్బంది పిల్లల వెండి కాళ్ళ కడియాలు స్వాధీనం చేసుకున్నారు.

X
దిశ, పెద్దకొత్తపల్లి: సందేట్లో.. సడేమియా అన్నట్లు ఆదివారం మండల పరిధిలోనీ నాయినేనిపల్లి మైసమ్మ దేవత జాతరలో ఇద్దరు మహిళ దొంగలు చిన్న పిల్లల వెండి కాళ్ళ కడియాలను సత్కరిస్తుండగా రెడ్ హ్యాండ్‌గా ఆలయ సిబ్బంది పట్టుకున్నారు. మహబూబ్‌నగర్‌కు చెందిన ఇద్దరు మహిళలు జాతరలో భక్తుల రద్దీగా ఉండే ప్రదేశాన్ని గుర్తించి తల్లుల చంకలో ఉన్న చిన్న పిల్లలకు కాళ్లకు ఉన్న వెండి కాళ్ళ కడియాలపై కన్నేసి ఉంచారు. రద్దీలో చిన్న పిల్లల తల్లులను అనుసరించి వెనకాల నుంచి ముగ్గురు చిన్న పిల్లల కడియాలను మహిళ దొంగలు తస్కరించారు. వీరు చేస్తున్న దొంగతనాలపై ఆలయ సిబ్బంది కన్నేసి రెడ్ హ్యాండ్‌గా పట్టుకున్నారు. దొంగల నుంచి మూడు జతల చిన్న పిల్లల వెండి కాళ్ళ కడియాలు, కొంత నగదును స్వాధీనం చేసుకుని పెద్ద కొత్తపల్లి పోలీసులకు అప్పగిస్తామని ఆలయ అధికారులు తెలిపారు.
Next Story






