- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉరి వేసుకొని రిక్షా కూలి ఆత్మహత్య
by Taduka Kalyani |
రిక్షా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకునే వ్యక్తి మనస్తాపంతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన ఘటన చేర్యాల పట్టణ కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది.

X
దిశ, చేర్యాల: రిక్షా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకునే వ్యక్తి మనస్తాపంతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన ఘటన చేర్యాల పట్టణ కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. చేర్యాల ఎస్సై గూడ అపూర్వ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణ కేంద్రానికి చెందిన బస్వరాజు రాజయ్య (70) రిక్షా తొక్కుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఐతే గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజయ్యను డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని చెప్పడంతో ఇంటివద్దే ఉంటున్నాడు. పని చేయకపోతే కుటుంబాన్ని పోషించుకోవడం ఇబ్బంది అవుతుందని భావించి తీవ్ర మనస్తాపానికి లోనైన మృతుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని బలవన్మరణం చెందాడు. కాగా రిక్షా రాజయ్య మృదు స్వభావం గల వ్యక్తిగా చేర్యాల పట్టణ కేంద్రంలో అందరికీ సుపరిచితుడు.
Next Story






