- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
SEBI: 5 లక్షల ఫాలోవర్లు ఉంటే సెలబ్రిటీ స్టేటస్
సినిమా స్టార్స్, ప్రముఖ క్రీడాకారులు మాత్రమే కాకుండా డిజిటల్ క్రియేటర్లు కూడా ఆర్థిక ప్రకటనల కఠిన నియంత్రణ పరిధిలోకి వస్తారు.

దిశ, బిజినెస్ బ్యూరో: ఆర్థిక ప్రకటనల మార్కెట్‌ను మరింత కట్టుదిట్టం చేయడానికి మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కొత్త నిబంధనల దిశగా అడుగులు వేస్తోంది. ప్రతిపాదిత కామన్ అడ్వర్టైజ్‌మెంట్ కోడ్ (సీఏసీ) ప్రకారం, ఒకే ప్లాట్‌ఫామ్‌పై 5 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లను కూడా ఇకపై ‘సెలబ్రిటీ’గా పరిగణించనున్నారు. అంటే, సినిమా స్టార్స్, ప్రముఖ క్రీడాకారులు మాత్రమే కాకుండా డిజిటల్ క్రియేటర్లు కూడా ఆర్థిక ప్రకటనల కఠిన నియంత్రణ పరిధిలోకి వస్తారు. ఈ డ్రాఫ్ట్ నిబంధనలపై అభిప్రాయాలు చెప్పేందుకు జూలై 14 వరకు గడువు ఇస్తున్నట్టు సెబీ స్పష్టం చేసింది. ఈ కొత్త ఫ్రేమ్‌వర్క్ పరిధి చాలా విస్తృతంగా ఉంది. ఒలింపిక్స్, ఆసియా గేమ్స్ వంటి అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొన్న అథ్లెట్లు, టీవీ షోల యాంకర్లు, రియాలిటీ షో విజేతలు కూడా సెలబ్రిటీ కేటగిరీలోకి వస్తారు. అంతేకాదు, ఏఐ ఆధారిత వర్చువల్ అవతార్లు కూడా ఇప్పుడు నియంత్రణ పరిధిలోకి రావడం ప్రత్యేక విషయం. ఈ సెలబ్రిటీలు ఇకపై ఆర్థిక ఉత్పత్తులపై నేరుగా సిఫార్సులు చేయలేరు, కేవలం బ్రాండ్ ప్రమోషన్‌కే పరిమితమవుతారు. ప్రకటనలపై ముందస్తు అనుమతి కొనసాగుతూనే, 24 గంటల్లోపే అన్ని ప్రకటనల వివరాలను సెబీ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. గ్యారంటీడ్ రిటర్న్స్, తప్పుదోవ పట్టించే క్లెయిమ్స్, డార్క్ ప్యాటర్న్స్ వంటి ప్రాక్టీసులపై కూడా కఠిన నిషేధాలు ప్రతిపాదించింది.






