నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు

by Taduka Kalyani |

పిల్లల నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు అత్యంత కీలకం అని మెదక్ పార్లమెంట్ సభ్యుడు మాధవనేని రఘునందన్ రావు అన్నారు.

నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు
X

దిశ, సిద్దిపేట అర్బన్ : పిల్లల నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు అత్యంత కీలకం అని మెదక్ పార్లమెంట్ సభ్యుడు మాధవనేని రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేట పట్టణంలోని నాసర్ పుర పట్టణ ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో ప్రారంభ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎంపీ రఘునందన్ రావు ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరి తల్లిదండ్రులు పోలియో చుక్కలు వేయించాలన్నారు. జిల్లా కలెక్టర్ కే. హైమావతి మాట్లాడుతూ... 1995 సంవత్సరం నుంచి పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాను పోలియో రహిత జిల్లాగా మార్చేందుకు, ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యాశాఖ ఐసిడిఎస్, గ్రామ పంచాయతీ ఇతర లైన్ డిపార్ట్మెంట్ అధికారులు వైద్య ఆరోగ్య శాఖతో సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. సిహెచ్ ధనరాజ్, ప్రోగ్రామ్ ఆఫీసర్లు డా. దీప్తి ప్రియాంక, డీఐవో డా. వినోద్, డాక్టర్ మహేందర్ రెడ్డి, డాక్టర్ శ్రీకాంత్ యాదవ్, డెమో నవీన్ కుమార్, హెచ్ ఈ సత్యనారాయణ, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

Next Story