- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉండవల్లి ఘటనపై 3 కేసులు.. మరింత లోతు విచారణ
అమరావతి రైతు పరిరక్షణ కమిటీ పేరుతో వైసీపీ బృదం అమరావతి పర్యటన నేపధ్యంలో శనివారం ఉండవల్లి వద్ద వైసీపీ నేతలు- అమరావతి రైతులు మధ్య జరిగిన ఘర్షణపై తాడేపల్లి పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. రాష్ట్ర వైసీపీ గ్రీవెన్స్ సెల్ ప్రతినిధి నారాయణ మూర్తి ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్ కార్లు ధ్వంసం, రాళ్ల దాడి ఘటనపై ఫిర్యాదు చేయగా టిడిపి నాయకులపై కేసు నమోదు చేశారు.....

దిశ, మంగళగిరి: అమరావతి రైతు పరిరక్షణ కమిటీ పేరుతో వైసీపీ బృదం అమరావతి పర్యటన నేపధ్యంలో శనివారం ఉండవల్లి వద్ద వైసీపీ నేతలు- అమరావతి రైతులు మధ్య జరిగిన ఘర్షణపై తాడేపల్లి పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. రాష్ట్ర వైసీపీ గ్రీవెన్స్ సెల్ ప్రతినిధి నారాయణ మూర్తి ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్ కార్లు ధ్వంసం, రాళ్ల దాడి ఘటనపై ఫిర్యాదు చేయగా టిడిపి నాయకులపై కేసు నమోదు చేశారు. ఉద్రిక్తత పెరుగుతున్న నేపద్యంలో వైసీసీ నేత అంబటి రాంబాబును అక్కడి నుండి పంపించి వేసేందుకు యత్నించిన తాడేపల్లి సిఐ వీరేంద్రను నెట్టినందుకు అయన ఫిర్యాదు మేరకు పోలీస్ విధులకు అటంకపరిచనందుకు అంబటి రాంబాబు తదితరులపై మరో కేసు నమోదు అయింది.
తాడేపల్లి మండలం పెనుమాక గ్రామానికి చెందిన తెనాలి మాణిక్యం ఫిర్యాదు మేరకు వైసీపీ నేతలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. వైసీపీ నాయకులు అంబటి రాంబాబు ఎమ్మెల్సీలు లేళ్ల అప్పరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, దేవినేని అవినాష్, పానుగంటి చైతన్య, నూనె ఉమామహేశ్వరరెడ్డి తదితరులపై కేసు నమోదు అయింది. టిడిపి నేతలు తన కారును ధ్వంసం చేసి దాడికి పాల్పాడ్డారని ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ ఆదివారం తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో మరో ఫిర్యాదు చేశారు.
ఉద్రిక్తత పరిస్దితులు కల్పించిన రౌడీ షీటర్లు
గతంలో రాష్ట్ర టిడిపి కార్యాలయంపై దాడి కేసులో ప్రధాన నిందితులు ఏ1, ఏ2 పానుగంటి చైతన్య, నూనె ఉమామహేశ్వరరెడ్డిలుఉండవల్లి ఘటనలో ఉద్రిక్తత పరిస్దితులు కల్పించి ఘర్షణ వైఖరి ప్రధాన కారణమైయ్యారనేది పోలీసుల విచారణలో వెలుగులొకి వచ్చింది. విజయవాడ, గుంటూరుకు చెందిన రౌడీలు వైసీపీ నేతల వెంట ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీడియో పుటేజ్, సిసి కెమెరా పుటేజ్ ఆధారంగా తాడేపల్లి పోలీసులు అయా కేసులపై లోతుగా సమగ్ర విచారణ చేపట్టారు.






