రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యం: ఎంపీ

by Kodari Anjali |   (  Updated:2026-06-28 12:31:23  IST  )

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పరిచి రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని ఎంపీ బలరాం నాయక్ అన్నారు.

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యం: ఎంపీ
X

దిశ, మరికల్: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పరిచి రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని ఎంపీ బలరాం నాయక్ అన్నారు. ఆదివారం బంజారా బస్సు యాత్ర మరికల్ పట్టణానికి చేరుకున్న సందర్భంగా ఎంపీ బలరాం నాయక్ మాట్లాడుతూ బంజారాలకు రిజర్వేషన్లు, విద్య, ఉద్యోగం, సంక్షేమం ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా తమ బంజారాలు కృషి చేస్తామని తెలిపారు. అనంతరం మరికల్ చౌరస్తాలో చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్, నారాయణపేట డీసీసీ మాజీ అధ్యక్షులు కుంభం శివకుమార్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఎస్.సూర్య మోహన్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బి.హర్షవర్ధన్ రెడ్డి, గ్రామ సర్పంచ్ గూప చెన్నయ్య, ఎల్.రాములు, హరీష్, రామకృష్ణ, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story