- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లిఫ్ట్‌లో డెలివరీ బాయ్‌పై దాడి.. విశాఖలో ఉద్రిక్తత
విశాఖ జిల్లా సీతమ్మధార ఆక్సిజన్ టవర్స్ వద్ద ఉద్రికత్త చోటు చేసుకుంది. డెలివరీ బాయ్స్ ఆందోళనకు దిగారు. లిఫ్ట్‌లో డెలివరీ బాయ్‌పై దాడి చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్డర్ డెలివరీ చేసే విషయంలో గొడవపెట్టుకుని దాడి చేశారని ఆరోపించారు...

దిశ, వెబ్ డెస్క్: విశాఖ జిల్లా(Visakha District) సీతమ్మధార ఆక్సిజన్ టవర్స్(SeetammaDhara Oxyzen Towers) వద్ద ఉద్రికత్త చోటు చేసుకుంది. డెలివరీ బాయ్స్ ఆందోళనకు దిగారు. లిఫ్ట్‌లో డెలివరీ బాయ్‌పై దాడి చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్డర్ డెలివరీ చేసే విషయంలో గొడవపెట్టుకుని దాడి చేశారని ఆరోపించారు. ఘటనపై ఎంవీపీ పోలీసులకు బాధితుడి ఫిర్యాదు చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా కష్టపడుతూ సేవలందిస్తున్న తమపై ఇలా దాడులు చేయడం దారుణమని మండిపడ్డారు. బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో అపార్ట్‌మెంట్ పరిసరాల్లో గందరగోళం వాతావరణం నెలకొంది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితుడిని గుర్తించేందుకు స్థానిక సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. అయితే ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.






