తండ్రికి తగ్గ తనయుడు అనిపిస్తున్న మేఘాంశ్.. ‘స్టూడెంట్’ మూవీ టీజర్‌తో పెరిగిన అంచనాలు

by Mallepaka Hamsa |

ఇందులో మేఘాంశ్ ఒక పవర్‌ఫుల్ కాలేజీ లీడర్‌గా అదరగొట్టారు.

తండ్రికి తగ్గ తనయుడు అనిపిస్తున్న మేఘాంశ్..  ‘స్టూడెంట్’ మూవీ టీజర్‌తో పెరిగిన అంచనాలు
X

దిశ, సినిమా: సినిమా ఇండస్ట్రీలో స్టార్ కిడ్స్ హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే. స్టార్ హీరో, హీరోయిన్స్ వారసులు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూ.. తమ టాలెంట్‌ను వెండితెరపై ప్రూవ్ చేసుకుంటున్నారు. ఇక ఇప్పుడు దివంగత స్టార్ శ్రీహరి తనయుడు మేఘాంశ్ కూడా హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. సరికొత్త యాక్షన్ డ్రామా ‘స్టూడెంట్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే ఈ సినిమాకు బాలు తత్వమసి కథ, స్క్రీన్ ప్లే అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో పరీక్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. జోవికా సినిమాస్, చెరిష్ మీడియా వర్క్స్ బ్యానర్లపై బెల్లం సిద్ధారెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రేమ్ చంద్ కంచర్ల సంగీతం అందిస్తున్నారు. క్యాంపస్ రాజకీయాలు, విద్యార్థి సంఘాల ఘర్షణ నేపథ్యంలో హై-వోల్టేజ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది.

షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి తాజాగా మేకర్స్ టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో మేఘాంశ్ ఒక పవర్‌ఫుల్ కాలేజీ లీడర్‌గా అదరగొట్టారు. డైలాగ్ డెలివరీలో, యాక్షన్ సీన్స్‌లో తండ్రి శ్రీహరి మార్క్‌ను గుర్తుచేసేలా ఆయన పర్ఫార్మెన్స్ సాగింది. దీంతో అది చూసిన వారంతా తండ్రికి తగ్గ తనయుడు అని అంటున్నారు. అయితే కాలేజీ స్టూడెంట్స్ మధ్య ఉండే ఇగోస్, గొడవలతో పాటు పొలిటికల్ ఎలిమెంట్స్‌ను కూడా ఈ సినిమాలో చూపించబోతున్నట్లు టీజర్ ద్వారా మేకర్స్ హింట్ ఇచ్చారు. కేవలం యాక్షన్, రాజకీయాలే కాకుండా ఈ సినిమాలో ఒక అందమైన లవ్ స్టోరీ కూడా ఉండబోతోందని టీజర్ చూస్తే అర్థమవుతోంది. రియల్ స్టార్ శ్రీహరి నటుడిగా టాలీవుడ్‌లో సంపాదించుకున్న క్రేజ్, అభిమానుల ఆదరణ అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఆయన కొడుకు మేఘాంశ్ ఒక విభిన్నమైన, పవర్‌ఫుల్ కమర్షియల్ సబ్జెక్ట్‌తో హీరోగా వస్తుండటంతో ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.



Next Story