అమరావతిలో తప్పులు జరుగుతున్నాయి: మాజీ మంత్రి బొత్స ఫైర్

by Vemula.Srinu Prasad |

అమరావతిలో తప్పులు జరుగుతున్నాయి కాబట్టే ప్రభుత్వం ఉలిక్కిపడుతోందని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఉండవల్లిలో జరిగిన ఘటనపై వైసీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేయడంపై ఆయన స్పందించారు...

అమరావతిలో తప్పులు జరుగుతున్నాయి: మాజీ మంత్రి బొత్స ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: అమరావతి(Amaravati)లో తప్పులు జరుగుతున్నాయి కాబట్టే ప్రభుత్వం ఉలిక్కిపడుతోందని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ(Former Minister and YCP MLC Botsa Satyanarayana) విమర్శించారు. ఉండవల్లి(Undavalli)లో జరిగిన ఘటనపై వైసీపీ(Ycp) నేతలపై పోలీసులు కేసులు నమోదు చేయడంపై ఆయన స్పందించారు. అధికారం చేతుల్లో ఉందని వైసీపీ నేతలపై అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే వైసీపీ నేతలపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలతో పాటు పోలీసుల మీద దాడి జరిగిందని, ఇది హత్యాయత్నం కాదా అని బొత్స ప్రశ్నించారు.

శాంతిభద్రతలు క్షీణించాయి..

రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని, ఆటవిక రాజ్యం నడుస్తుందనడానికి ఇదొక నిదర్శనమని బొత్స విమర్శించారు. అమరావతికి వైసీపీ నేతలు వెళ్తే తప్పేంటన్నారు. అమరావతి దోపిడీని చూస్తే తప్పేంటని బొత్స ప్రశ్నించారు. అభివృద్ధి జరిగితే తమకెందుకంత భయమని నిలదీశారు. అమరావతి రైతులు సమస్యలు చెప్పుకోవడంతోనే తమ పార్టీ వాళ్లు అక్కడికి వెళ్లారని తెలిపారు. ‘మావిగన్’ అనేది తమ విధానమని బొత్స స్పష్టం చేశారు.

Next Story