- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌కు వర్షసూచన.. ఈ ప్రాంతాల్లో కుండపోత వర్షం
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలకు భారీ వర్షసూచన ఉన్నట్టు వెదర్ మ్యాన్ బాలాజీ పేర్కొన్నారు. నగరంలో మధ్యాహ్నం వరకు ఎండలు మండిపోగా మధ్యాహ్నం తరవాత వాతావరణం పూర్తిగా మారిపోయింది.

heavy rains in telangana for three days
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలకు భారీ వర్షసూచన ఉన్నట్టు వెదర్ మ్యాన్ బాలాజీ పేర్కొన్నారు. నగరంలో మధ్యాహ్నం వరకు ఎండలు మండిపోగా మధ్యాహ్నం తరవాత వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తుండగా మరికొన్ని ప్రాంతాలకు సైతం భారీ వర్షసూచన ఉన్నట్టు తెలిపారు. ముఖ్యంగా నగరంలోని సెంట్రల్ హైదరాబాద్ లో వర్షం కురుస్తుందని పేర్కొన్నారు. ఖైరతాబాద్, జూబ్లిహిల్స్, అమీర్ పేట్, మెహెదీపట్నం, టోలిచౌకి, షేక్ పేట్ లో కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు.
అదే విధంగా పంజాగుట్ట, ఎల్లారెడ్డిగూడ, శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, మియాపూర్, బేగంపేట, బాలనగర్, బోయినపల్లి, సనత్ నగర్, యూసుఫ్ గుడ ప్రాంతాల్లోనూ వర్షం కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఇక రాష్ట్రంలోకి ఇప్పటికే రుతుపవనాలు ఎంట్రీ ఇవ్వడంతో వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ తో పాటు ఇతర జిల్లాలోనూ వానలు పడుతున్నాయి. అయితే ఓవైపు వర్షాలు కురుస్తున్నప్పటికీ మరోవైపు మధ్యాహ్నం సమయాల్లో ఎండలు సైతం అదే రేంజ్ లో కొడుతున్నాయి. దీంతో విభిన్నవాతావరణం కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.






