- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన కలెక్టర్
జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రారంభించారు.

కామారెడ్డి టౌన్ : జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రారంభించారు. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన కలెక్టర్, 5 ఏళ్లలోపు ప్రతి బిడ్డకు తప్పనిసరిగా చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు.
ఒక్క చిన్నారి కూడా మిగలొద్దు ..
పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఒక్క చిన్నారి కూడా ఈ కార్యక్రమానికి దూరం కాకుండా చూడాలని తెలిపారు. జిల్లాలో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రాలు, మొబైల్ బృందాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ, మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఉమారాణి, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, ఆసుపత్రి వైద్యులు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు.






