- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వికారాబాద్ గాలి పీలిస్తే రోగాలన్నీ పోతాయి: కేటీఆర్
వికారాబాద్ గాలి పీలిస్తే రోగాలన్నీ పోతాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వికారాబాద్‌లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. జ్వరం ఉన్నా వికారాబాద్‌కు వచ్చానని, ఇక్కడి గాలి పీల్చుకుంటే ఉన్న రోగాలు పోతాయని వ్యాక్యానించారు.

దిశ, వెబ్ డెస్క్: వికారాబాద్ గాలి పీలిస్తే రోగాలన్నీ పోతాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వికారాబాద్‌లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. జ్వరం ఉన్నా వికారాబాద్‌కు వచ్చానని, ఇక్కడి గాలి పీల్చుకుంటే ఉన్న రోగాలు పోతాయని వ్యాక్యానించారు. ఇది అద్భుతమైన పర్యాటక కేంద్రం అని కొనియాడారు. ఇక్కడ నీరు, గాలి, ప్రకృతి అన్ని ఔషధాలేనని అన్నారు. మోసపోతే గోసపడుతారు అని కేసీఆర్ చెప్పారు.. ఇప్పుడు అదే జరుగుతుందని వ్యాఖ్యానించారు. వికారాబాద్ ప్రజలకు మంచి చేయాలని అభివృద్ధి చేయాలని మెతుకు ఆనంద్ ఆలోచించారని, అలాంటి నాయకుణ్ణి మనం ఒడిగొట్టుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
కేసీఆర్ అప్పులు చేసి పోయాడు అని స్పీకర్ చెబుతున్నాడని, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న స్పీకర్ ఇలాంటి మాటల వల్ల మీ గౌరవం తగ్గుద్ది తప్ప పెరగదని విమర్శించారు. కేసీఆర్ చేసిన అప్పు పార్లమెంట్ వేదికగా లెక్కలు బయటపెట్టారని 2014 లో అధికారంలోకి వచ్చాక రూ. 72 వేల కోట్లు అప్పు ఉంటే కేసీఆర్ దిగిపోయాక ఉన్న అప్పు 3 లక్షల 52 వేల కోట్లు.. కొత్తగా చేసిన అప్పు 2 లక్షల 80 వేల కోట్లు మాత్రమేనని అన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు దొరికిన యూరియా ఇప్పుడు ఎందుకు దొరకడం లేదని విమర్శించారు. కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటల కరెంట్.. ఇప్పుడు కరెంట్ కోతలేనని చెప్పారు. అప్పుడు రైతుబంధు టైంకి వస్తుండే.. రైతు రుణమాఫీ జరిగిందని చెప్పారు.
రుణమాఫీ రెండు లక్షలు తీసుకోండి మేం వస్తె మాఫీ చేస్తామని చేయలేదన్నారు. కౌలు రైతులకు, కూలీలకు కూడా ఇస్తాం అన్నారు.. రైతు బంధు ఎందుకు బంద్ అవుద్ది మేమేం అన్న దివానాగాల్లమా అన్నాడు.. ఇప్పుడు ఏమని పిలవాలని ప్రశ్నించారు. దొంగ మాటలు, దగుల్బాజీ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని.. అప్పులపాలు అయింది అంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ చేసిన అప్పుల ద్వారా ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించారన్నారు.
కేసీఆర్ మెడికల్ కాలేజీలు తెచ్చారు, గురుకులాల సంఖ్య పెంచారని చెప్పారు. పింఛన్లు పెంచారని, 24 గంటల కరెంట్ రైతులకు ఇచ్చిన మొగాడు మొనగాడు కేసీఆర్ అని అన్నారు. అంధకారంలో ఉన్న తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించారని వ్యాఖ్యానించారు. కేసులు ఎక్కువ అవుతున్నాయి అంటున్నారు.. ఎన్ని కేసులు ఎక్కువ అయితే వాళ్ళు పెద్ద లీడర్లు అవుతారని చెప్పారు. 2028 లో మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు.. అందుకే కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే దోచుకుందాం అనుకుంటున్నారని విమర్శించారు. పోలీసులు డ్యూటీ చేయండి.. అతి చేయకండి అంటూ హెచ్చరించారు. తాపు అధికారంలోకి వచ్చాక ఎక్కడ ఉన్నా బయటికి తీసుకువచ్చి మిత్తితో కలిపి చెల్లిస్తామని వార్నింగ్ ఇచ్చారు.






