- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘భయమా.. నాకా?’ ఆస్ట్రేలియాలో భారతీయ తాత సాహసం: 18 వేల అడుగుల ఎత్తు నుంచి స్కైడైవింగ్! (వీడియో)
భారత్‌కు చెందిన ఓ తాత ఆస్ట్రేలియాలో ఏకంగా 18,000 అడుగుల ఎత్తు నుంచి స్కైడైవింగ్ చేసి నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: సాధారణంగా వయసు పైబడిన వారు చిన్న చిన్న సాహసాలు చేయడానికే జంకుతారు. కానీ, భారత్‌కు చెందిన ఓ తాత మాత్రం ఆస్ట్రేలియాలో ఏకంగా 18,000 అడుగుల ఎత్తు నుంచి స్కైడైవింగ్ చేసి నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేశారు. ఆయన ధైర్యానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
గతంలో 15 వేలు.. ఇప్పుడు 18 వేలు
వైరల్ వీడియో ప్రకారం.. అంకిత్ అనే యువకుడు తన తాతను స్కైడైవింగ్ కోసం ఆస్ట్రేలియా తీసుకెళ్లాడు. గతంలో 15,000 అడుగుల ఎత్తు నుంచి స్కైడైవింగ్ చేసిన తన తాతతో, ఈసారి ఏకంగా 18,000 అడుగుల ఎత్తు నుంచి జంప్ చేయించినట్లు అంకిత్ వీడియోలో తెలిపాడు. విమానం నుంచి కిందకు దూకే ముందు.. ‘తాతా భయంగా ఉందా?’ అని మనవడు అడగ్గా.. ‘నేను భయపడటమా? (డర్తా కౌన్ హై మైన్?)’ అంటూ ఆ వృద్ధుడు చిరునవ్వుతో ఎంతో ఆత్మవిశ్వాసంగా బదులిచ్చాడు. ఈ దృశ్యం వీడియోకే హైలైట్‌గా నిలిచింది. స్కై డైవింగ్ చేస్తూ గాలిలో కిందకు జారుతున్న సమయంలో ఆ తాత ఏమాత్రం భయపడకుండా ‘జై హింద్! జై భారత్! జై హర్యానా!’ అంటూ ఉత్సాహంగా నినాదాలు చేయడం విశేషం. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆ తాత ధైర్యసాహసాలకు ఫిదా అవుతున్నారు. ఈ వయసులో కూడా ఆయనకున్న ఎనర్జీకి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ‘నేటి యువత కంటే తాతకే ధైర్యం ఎక్కువ’ అంటూ నెటిజన్లు కామెంట్ల రూపంలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.






