- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ ప్రాంత ప్రజాసేవకై నా ఆత్మ ఎప్పుడూ పరితపిస్తుంటుంది: కేకే మహేందర్ రెడ్డి
సంవత్సరాలుగా మానేరు గడ్డబిడ్డగా నన్ను అక్కున చేర్చుకొని ఆదరిస్తున్న సిరిసిల్ల ప్రాంత ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటానని కేకే మహేందర్ రెడ్డి అన్నారు.

దిశ, ఎల్లారెడ్డిపేట: గత 25 సంవత్సరాలుగా మానేరు గడ్డబిడ్డగా నన్ను అక్కున చేర్చుకొని ఆదరిస్తున్న సిరిసిల్ల ప్రాంత ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటానని కేకే మహేందర్ రెడ్డి అన్నారు. నా అంతరాత్మ, మనసు ఎప్పుడు ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయాలనే పరితపిస్తుందని తప్పకుండా ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటానని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జరిగిన ఆత్మ కమిటీ ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భావోద్వేగానికి గురయ్యారు. మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు 5దొమ్మాటి నర్సయ్య అధ్యక్షతన ఆదివారం జరిగిన ఈ సమావేశం లో సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, తాను చచ్చినా బ్రతికిన ఈ గడ్డమీదనే అంతిమ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు కాబడి రెండున్నర సంవత్సరాలు అవుతుందని ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరి పైన ఉందన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు...
ముందుగా మార్కెట్ కమిటీలను ప్రభుత్వం నామినేటెడ్ చేయగా, కొంతమందికి అవకాశం కల్పించడం జరిగిందని అన్నారు. అలాగే ఆత్మ కమిటీలో కూడా చైర్మన్ కొండం రాజిరెడ్డితో పాటు 24 మంది సభ్యులకు అవకాశం డైరెక్టర్లుగా కల్పించామన్నారు. పదవి అనేది ప్రజలకు సేవ చేసే ఒక బాధ్యతగా భావించాలన్నారు. 6 కోట్ల రూపాయలతో వ్యవసాయ గోదాం భవనాలు మంజూరు చేసామన్నారు. మహిళా సంఘాలకు రెండు కోట్ల రూపాయలతో ఎన్ని మహిళా సంఘాలు అడిగినా అన్నింటికీ మంజూరు ఇవ్వడం జరిగిందని అన్నారు. ప్రభుత్వం ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలను చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ లు స్వరూపారెడ్డి, ఎస్ కే సాబేర బేగం రాణి, కొమిరిశెట్టి విజయ, రాములు నాయక్, సిరిసిల్ల టౌన్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, ఎల్లారెడ్డిపేట గంభీరావుపేట వీర్నపల్లి ముస్తాబాద్ తంగళ్ళపల్లి మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి ఎండి హమీద్, జలగం ప్రవీణ్, ఏళ్ళ బాల్ రెడ్డి, సిరిసిల్ల మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఆడెపు చంద్రకళ, ఐదు మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.






