ధ్వజస్తంభం నిర్మాణానికి భారీ విరాళం...

by Kodari Anjali |

బండ్ల రాజశేఖర్ రెడ్డి శ్రీశ్రీశ్రీ ఆంజనేయ స్వామి ధ్వజస్తంభం నిర్మాణానికి వంతు సాయంగా రూ. 1,50,000 అందజేశారు.

ధ్వజస్తంభం నిర్మాణానికి భారీ విరాళం...
X

దిశ, మల్దకల్: జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం నేతోని పల్లి గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామివారికి గద్వాల నియోజకవర్గం రమ్య ఇండస్ట్రీ సిడి ఆఫీసులో బండ్ల రాజశేఖర్ రెడ్డి శ్రీశ్రీశ్రీ ఆంజనేయ స్వామి ధ్వజస్తంభం నిర్మాణానికి వంతు సాయంగా, 1,50,000/- రూపాయలు గ్రామ సర్పంచ్ కమిటీ సభ్యులకు అందజేశారు. స్వయంగా కమిటీ సభ్యులకు నగదు అందజేశారు. ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఆయన కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా స్వామి వారి ఆశీస్సులు ఉండాలని ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఆలయ కమిటీ సభ్యులు, నాయకులు గ్రామస్తులు ఆయనకు ఆ భగవంతుడు మంచిగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పద్మ వెంకటేష్ నాయక్, మాజీ సర్పంచ్ హనుమంతు,పెద్ద ఈరన్న, నాగేంద్ర, పరమేశ్,చిన్న తిమ్ములు, నడిపి ఈరన్న, శివన్న చిన్నకర్రెన్న, ఆటో పిటి సవరన్న, తిమ్మప్ప, సర్పంచ్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story