- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్యాన్సర్ రోగుల ప్రాణదాత పద్మశ్రీ 'విజయానంద రెడ్డి'
క్యాన్సర్ రోగుల ప్రాణదాతగా నిలిచిన వ్యక్తి పద్మశ్రీ డాక్టర్ పాలకొండ విజయానందరెడ్డి అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రశంసించారు.

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి: వైద్యరంగంలో అత్యాధునిక పద్దతులను అందుబాటులోకి తెచ్చి వేలాది మంది క్యాన్సర్ రోగుల ప్రాణదాతగా నిలిచిన వ్యక్తి పద్మశ్రీ డాక్టర్ పాలకొండ విజయానందరెడ్డి అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రశంసించారు. ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని రాజా బహదూర్ రెడ్డి కన్వెన్షన్ సెంటర్ లో పాలమూరు రెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన ప్రముఖ క్యాన్సర్ వైద్యులు డాక్టర్ పాలకొండ విజయానందరెడ్డి కి కేంద్ర ప్రభుత్వ 'పద్మశ్రీ' పురస్కారం అందజేసిన సందర్భంగా నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, డాక్టర్ పాలకొండ విజయానందరెడ్డి ని శాలువా, జ్ఞాపిక తో ఘనంగా సత్కరించి మాట్లాడారు.
అరుదైన వ్యక్తిత్వం గల పాలకొండ..
ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ పాలకొండ విజయానందరెడ్డి వైద్య రంగంలో విశేషంగా సేవలందించారని, క్యాన్సర్ చికిత్సలో రోగులకు ఆయన సేవలందించడమే కాకుండా, వారికి మనోధైర్యాన్ని అందించడంలోనూ ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారని, ఆయన చేసిన సేవలకు ఏనాడో 'పద్మశ్రీ' పురస్కారం రావాల్సిందన్నారు. విజయానంద రెడ్డి కి పద్మశ్రీ పురస్కారం రావడం మహబూబ్ నగర్ కు గర్వకారణం అని, అరుదైన వ్యక్తిత్వం గల పాలకొండ విజయానందరెడ్డి పాలమూరు బిడ్డలకు అండగా ఉంటూ వైద్యరంగంలో ప్రపంచస్థాయి గుర్తింపు పొందాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్ విజయానంద రెడ్డి మాట్లాడుతూ, ఈ పురస్కారం తనకు మరింత బాధ్యతను, సేవ చేయాలనే వినయాన్ని పెంచిందని అన్నారు. తనను ఘనంగా సన్మానించిన రెడ్డి సేవా సమితి కి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తూము ఇంద్రసేనారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నర్సింహారెడ్డి, రాజేందర్ రెడ్డి, సీతా దయాకర్ రెడ్డి, ఏపి మిథున్ రెడ్డి, సురేందర్ రెడ్డి, కోటేశ్వర్ రెడ్డి, తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.






