- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, కమ్మర్ పల్లి : వైద్యులు దేవుళ్లతో సమానం. అయితే ప్రైవేట్ ఆస్పత్రిలలో అర్హత లేకున్నా వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకున్న కొందరు వైద్యం పేరుతో అందినకాడికి దోచుకుంటున్నారు. కమ్మర్ పల్లి మండల కేంద్రంలో వైద్యం పేరుతో రెండు ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యం పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్రభుత్వ అనుమతులు, కనీస రిజిస్ట్రేషన్ లేకుండానే ఏళ్ల నుండి దర్జాగా వైద్య దందా కొనసాగిస్తున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఆసుపత్రిలో ఈసీజీ, ఎక్స్రే మిషిన్లు, బెడ్లు ఏర్పాటు చేసుకొని టెస్టుల పేరుతో ప్రజల జేబులను గుల్ల చేస్తున్నారు. ఇంత జరుగుతున్న వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు ఎదుర్కొంటున్నారు రెండు రోజుల క్రితం ఒక ప్రైవేట్ హాస్పిటల్ పై లైసెన్స్ లేక నడిపిస్తున్నారని మెడికల్ ఆఫీసర్ కు ఫిర్యాదు ఇవ్వగా డాక్టర్ నరసింహస్వామి రెండు ప్రైవేట్ హాస్పిటల్ లను సరైన అనుమతులు లేనందున పోలీసుల సహాయంతో మూసి వేయించారు. నిబంధనల ప్రకారం అన్ని రకాల అనుమతులు ఉంటేనే ప్రైవేట్ హాస్పిటల్ ఓపెన్ చేయాలని లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సూచించారు. గతంలో ఎన్నోసార్లు వార్నింగ్ ఇచ్చి పై అధికారులకు నివేదిక పంపించినట్లు తెలిపారు.
అధికారుల నిర్లక్ష్యం ..
మండల కేంద్రంలోని జాతీయ రహదారి పక్కనే దర్జాగా సాగుతున్న వైద్య వ్యాపారంలో ఎన్నో లోసుగులు, అక్రమాలు బహిర్గతమవుతున్నా సంబంధిత శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించడం గమనార్హం. పర్యవేక్షించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం విమర్శలకు దారి తీస్తున్నది. దీంతో అక్రమార్కుల వైద్య దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్నది.
చర్యలు తీసుకుంటాం..
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే హాస్పిటలపై కఠిన చర్యలు తీసుకుంటాం. అర్హత లేని డాక్టర్లతో వైద్య సేవలు అందించినా తప్పే. ప్రజలకు ఇబ్బందులు సృష్టించే వారిపై చర్యలు ఉంటాయి. ప్రజలెవరైనా ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం.
–వైద్యాధికారి డాక్టర్ నరసింహస్వామి, కమ్మర్ పల్లి






