తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. వచ్చే 2 గంటల్లో ఆ జిల్లాల్లో కుంభవృష్టి వర్షాలు

by Malleboina Mahesh |

తెలంగాణకు భారీ వర్షాల హెచ్చరిక.. వచ్చే 2 గంటల్లో జనగామ, యాదాద్రి, నల్గొండ, రంగారెడ్డి సహా పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన కుంభవృష్టి!

తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. వచ్చే 2 గంటల్లో ఆ జిల్లాల్లో కుంభవృష్టి వర్షాలు
X

దిశ, వెడ్ డెస్క్: వర్షాకాలం వచ్చిన వానలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు తెలంగాణ వెదర్ మ్యాన్ (Telangana Weatherman) కీలక అలర్ట్ జారీ చేశారు. ఈ జోరు మధ్యాహ్నం తర్వాత రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో కుంభవృష్టి వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు ఆయన అంచనా వేశారు. రాష్ట్రంలో అక్కడక్కడా ఉన్న ఒంటరి మేఘాలు ప్రస్తుతం తీవ్రమైన ఉరుములు, మెరుపులతో కూడిన తుఫాను మేఘాలుగా విస్తరించాయని వెదర్‌మ్యాన్ తాజాగా హెచ్చరిక జారీ చేశారు. వచ్చే రెండు గంటల్లో జనగామ, యాదాద్రి-భువనగిరి, నల్గొండ జిల్లాల నుండి ప్రారంభమై ఈ తీవ్రమైన తుఫాను మేఘాలు రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల వైపు వేగంగా విస్తరిస్తూ భారీ వర్షాలు కురిపించనున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో హైదరాబాద్ నగరంలో నమోదైన విపరీతమైన ఎండ, వేడి కారణంగా ఒక్కసారిగా ఉరుముల మేఘాలు (Scattered Thunderstorms) వేగంగా ఏర్పడటం ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుత వాతావరణ సమాచారం ప్రకారం.. వాయువ్య హైదరాబాద్ పరిధిలోని శేరిలింగంపల్లి, మియాపూర్, ఆర్‌సీ పురం, నిజాంపేట్ పరిసర ప్రాంతాలతో పాటు శంషాబాద్, మొయినాబాద్‌లలో వచ్చే రెండు గంటల్లో భారీ ఉరుములు, మెరుపులతో కూడిన కుంభవృష్టి కురిసే అవకాశం ఉంది. సాయంత్రం, రాత్రి సమయం అయ్యే కొద్దీ హైదరాబాద్ నగరవ్యాప్తంగా మరిన్ని ప్రాంతాలకు ఈ వర్షాలు విస్తరించనున్నట్లు అంచనా వేశారు. అలాగే ఈ రోజు సాయంత్రం, రాత్రి వేళల్లో తెలంగాణతో పాటు హైదరాబాద్ నగరంలోనూ వాతావరణం అత్యంత క్రియాశీలంగా (Active Evening-Night Storms) మారబోతున్నందని, వాహనదారులు, నగర ప్రజలు తమ ప్రయాణాలను వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని ఈ సందర్భంగా వెదర్ మ్యాన్ సూచించారు.

Next Story