- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: రోడ్డు నెట్‌వర్క్‌లో సరికొత్త విప్లవం.. నల్గొండలో హ్యామ్ రోడ్ల పైలాన్ ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో రూ.13,006 కోట్లతో హ్యామ్ రోడ్ల ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్) మొదటి దశలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ర. 13,006.27 కోట్లతో 6,092.37 కిలోమీటర్ల మేర 34 ప్యాకేజీల్లో 441 రహదారుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇవాళ నల్గొండ జిల్లా కనగల్‍లో ఏర్పాటు చేసిన హ్యామ్ రోడ్ల పైలాన్‍ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్,మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టులో భాగంగా నల్గొండ వైద్య కళాశాల నుంచి మేళ్లదుప్పలపల్లి వరకు, చిట్యాల నుంచి భువనగిరి వరకు, దర్వేశిపురం నుంచి డిండి వరకు హ్యోమ్ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు.
మరికాసేపట్లో బహిరంగ సభ:
అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల అనంతరం ఇవాళ సాయంత్రం 4:30 గటంలకు నల్గొండలోని ఎన్జీ కాలేజీ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకాబోతున్నారు. ఈ సభకు సుమారు లక్షమంది ప్రజలను సమీకరించాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సభలో సీఎం ఏం మాట్లాడబోతున్నారు అనేది ఉత్కంఠగా మారింది.






