గత ప్రభుత్వంపై స్పీకర్ దుష్ప్రచారం చేయడం సరైనది కాదు : కేటీఆర్

by Taduka Kalyani |

గత ప్రభుత్వంపై స్పీకర్ దుష్ప్రచారం చేయడం సరైనది కాదు  : కేటీఆర్
X

దిశ, వికారాబాద్ ప్రతినిధి: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రైతులను పేద బడుగు బలహీన వర్గాలను మోసం చేస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మడం లేదని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఆదివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని గౌలి కార్ ఫంక్షన్ హాల్ లో జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఆనంద్ అధ్యక్షతన నాయకుల కార్యకర్తల జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో సీఎం రేవంత్ రెడ్డి ఆయన సోదరులు భూములు లాక్కుంటున్నారని రైతులు కన్నీరు పెడితే పుట్టగతులు ఉండవని ఆయన పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అన్నదమ్ములు భూములు లాక్కుంటున్నారు. వికారాబాద్ కు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఏంచేశారో చెప్పాలి అని పేర్కొన్నారు. అసత్యపు ఆరోపణలు చేస్తూ గత ప్రభుత్వం అప్పులు చేసిందని మేము వాటిని వడ్డీలు కడుతున్నామని స్పీకర్ హోదాలో ఉండి ఇలా మాట్లాడడం సరైనది కాదన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా సీఎం కేసీఆర్ అప్పులు చేసిన జిల్లాలు ఏర్పాటు చేసి జిల్లా కార్యాలయాలతో పాటు మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసి వాటి నిర్మాణాలు చేసి అభివృద్ధి చేశారన్నారు. ప్రాజెక్టులు చేపట్టి రైతన్నలకు సాగునీరు అందించిన భగీరథుడు కేసీఆర్ అన్నారు. పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారి అభివృద్ధికి బాటలు వేశారన్నారు.

రైతులకు రైతుబంధు తో పాటు ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉంచి రైతు కష్టాలు తీర్చిన మహనీయుడు కేసీఆర్ అన్నారు. ఇలాంటివి చూడకుండా రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి అసత్యపు ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు. అసత్యపు ప్రచారాలు చేస్తూ నాయకులపై కార్యకర్తలపై కేసులు పెడితే సహించేది లేదని హెచ్చరించారు. అధికారులు పోలీసులు ఇష్టానుసారంగా అధికార పార్టీకి కొమ్ముకాసి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేయవద్దని అన్నారు. 12 లక్షల చెట్లు నరికి దామగుండంలో నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటు చేయడం దుర్మార్గం అని అన్నారు. 2028 లో మళ్లీ తెలంగాణ లో బిఆర్ఎస్ అధికారంలో రావడం పక్కా అని పేర్కొన్నారు. కాంగ్రెస్ కా ఖేల్ ఖతం దుకాన్ బంద్ చేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. రైతులకు రైతుబంధు అవసరానికి యూరియా ఎరువులు ఈయ్యాక పోతే మీరు ఎందుకు ఉన్నారు అని ప్రశ్నించారు. కెసిఆర్ అప్పులు చేసి సంక్షేమ పథకాలు అమలు చేశారూ పేదల పెళ్లిళ్లకు పెద్దదిక్కుల కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకాలు ఇచ్చారన్నారు. పేదల ఆరోగ్యానికి ఆర్థిక భరోసాగా సీఎం రిలీఫ్ ఫండ్ అమలు చేసి పేదల ఆరోగ్యానికి అండగా నిలిచారన్నారు. కాంగ్రెస్ వి 13 డిక్లరేషన్లు ఎక్కడున్నాయో చెప్పాలి అని అన్నారు. ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారన్నారు ఆడపడుచులకు నెలకు 2500 ఇస్తానని ఇప్పటికీ అమలు చేయలేదని ఇలా చెప్పుకుంటూ పోతే 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిపోయిందన్నారు. వికారాబాద్ ప్రజల ఆకాంక్షను నెరవేర్చింది కేసీఆర్ కాదా వికారాబాద్ కు మెడికల్ కళాశాల కలెక్టరేట్ ను మంజూరు చేశాము ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. పట్టణానికి ప్రధానంగా ఉన్నటువంటి సమస్య రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి 96 కోట్లు మంజూరు చేసి అభివృద్ధికి బాటలు వేయడం జరిగిందన్నారు.

ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ అధికారం ఉంది కదా అని నాయకులపై కార్యకర్తలపై ఎన్ని కేసులు పెట్టినా భయపడి లేదని అన్నారు. అధికారం శాశ్వతం కాదని వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వం అని ఆయన పేర్కొన్నారు. స్పీకర్ ప్రసాద్ కుమార్ ఎలాంటి అభివృద్ధి చేయకుండా ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. స్పీకర్ గా అభివృద్ధి చేయకపోయినా మున్సిపల్ చైర్మన్ తన కూతురుని చేసి అభివృద్ధి చేస్తారని చూస్తే పట్టణంలోని రోడ్లన్నీ అధోగతి ఉన్న గంపెడు మన్ను వేసి గుంతలు పూడ్చిన పాపాన పోవడం లేదని అన్నారు. అభివృద్ధి చేయకుండా అధికారంతో చెలాయించడం సరి అయింది కాదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సబితా రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు నరేందర్ రెడ్డి మహేష్ రెడ్డి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గట్టు రామచంద్రారావు మాజీ మౌలిక విద్యా వసతుల కల్పన చైర్మన్ నాగేందర్ గౌడ్. మాజీ బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ మండలాల పార్టీ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story