- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దుప్పటి అడిగినందుకు దాష్టీకం.. బాలికను హాస్టల్ నుంచి పంపేసిన వార్డెన్
దుప్పటి అడిగిన పుణ్యానానికి హాస్టల్ వార్డెన్ అమానుషానికి పాల్పడ్డారు. 8 తరగతి విద్యార్థినిని అప్పటికప్పుడు హాసల్ నుంచి ఖాళీ చేయించేశారు. ఈ దారుణ ఘటన ఏలూరు జిల్లాలో జరిగింది....

దిశ, వెబ్ డెస్క్: దుప్పటి అడిగిన పుణ్యానానికి హాస్టల్ వార్డెన్ అమానుషానికి పాల్పడ్డారు. 8 తరగతి విద్యార్థినిని అప్పటికప్పుడు హాసల్ నుంచి ఖాళీ చేయించేశారు. ఈ దారుణ ఘటన ఏలూరు జిల్లాలో జరిగింది. 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని అక్షయ చింతలపూడి ఎస్సీ బాలికల హాస్టల్‌లో ఉంటుంది. అయితే రాత్రి సమయంలో చలి ఎక్కువగా ఉండటంలో హాస్టల్ వార్డెన్‌ను ఓ దుప్పటి ఇవ్వాలని విద్యార్థినిని అడిగారు. దీంతో హాస్టల్ వార్డెన్ ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. హాస్టల్ నుంచి వెళ్లిపోవాలని రాత్రి 10 గంటల సమయంలోనే హుకూం జారీ చేశారు.
చలిలోనే హాస్టల్ ఖాళీ చేసిన విద్యార్థిని
దీంతో చేసేదేమీలేక రాత్రి సమయంలో చలికి వణుకుంటూ విద్యార్థినిని హాస్టల్ నుంచి బయటకు వచ్చేసింది. విషయం తల్లిదండ్రులకు తెలియడంతో ఆ సమయంలో హాస్టల్‌కు వచ్చి విద్యార్థిని అక్షయను ఇంటికి తీసుకెళ్లారు. హాస్టల్ వార్డెన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై విచారణ చేపట్టి వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని విద్యార్థిని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వార్డెన్‌పై చర్యలకు డిమాండ్లు పెరుగుతున్నాయి. త్వరగా ఉన్నతాధికారులు స్పందించాలని కోరుతున్నారు.






