జులై 4 నుంచి ఫ్లిప్‌కార్ట్ ‘GOAT’ సేల్.. ఐఫోన్ 17 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు!

by Ramesh Naini |

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ సరికొత్త ఆఫర్లతో వినియోగదారుల ముందుకు రానుంది.

జులై 4 నుంచి ఫ్లిప్‌కార్ట్ ‘GOAT’ సేల్.. ఐఫోన్ 17 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ సరికొత్త ఆఫర్లతో వినియోగదారుల ముందుకు రానుంది. జులై 4 నుంచి ప్రతిష్టాత్మక ‘గోట్ సేల్’ #GOATSale ప్రారంభం కానుండగా, ఫ్లిప్‌కార్ట్ ప్లస్, బ్లాక్ మెంబర్లకు ఒక రోజు ముందుగానే (జులై 3న) ఎర్లీ యాక్సెస్ లభిస్తుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, లాప్‌టాప్‌లు, టీవీలపై రాయితీలు ఉన్నప్పటికీ, ప్రధానంగా ఐఫోన్ 17 సిరీస్‌పై ఫ్లిప్‌కార్ట్ ప్రకటించిన బంపర్ ఆఫర్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

ఐఫోన్ 17 సిరీస్ ఆఫర్ ధరల వివరాలు..

జాతీయ మీడియా సమాచారం ప్రకారం.. చిప్ కొరత కారణంగా యాపిల్ ఉత్పత్తుల ధరలు పెరుగుతున్న తరుణంలో, ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 17 సిరీస్‌పై రూ.12,000 నుంచి రూ.22,000 వరకు భారీ తగ్గింపును ప్రకటించింది. ఐఫోన్ 17.. దీని లాంచ్ ధర రూ.82,900 కాగా, సేల్‌లో లభించే రూ.12,000 ఫ్లాట్ డిస్కౌంట్‌తో రూ.70,900 (లేదా ఆఫర్ల తర్వాత రూ.70,990) కే లభించనుంది. ఐఫోన్ 17 ప్రో.. రూ.1,34,900 విలువైన ఈ ప్రీమియం మోడల్‌పై రూ.22,000 భారీ తగ్గింపు లభించనుంది. దీని ఎఫెక్టివ్ ధర రూ.1,12,900. ఐఫోన్ 17 ప్రో మాక్స్.. రూ. 1,49,900 విలువైన ఈ టాప్-ఎండ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్, రూ. 22,000 డిస్కౌంట్ తర్వాత రూ.1,27,900 కే సొంతం చేసుకోవచ్చు. వీటితో పాటు పాత మోడల్స్ అయిన ఐఫోన్ 15, ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లపై కూడా ఆకర్షణీయమైన డీల్స్ అందుబాటులో ఉండనున్నాయి.

అదనపు బ్యాంక్ ఆఫర్లు & ఈఎంఐ సౌకర్యం..

కొనుగోలుదారుల కోసం ఫ్లిప్‌కార్ట్ మరికొన్ని ఆర్థిక ప్రయోజనాలను కూడా కల్పించింది. ఐసీఐసీఐ (ICICI), బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB), హెచ్‌ఎస్‌బీసీ (HSBC) క్రెడిట్ కార్డుల ద్వారా జరిపే లావాదేవీలపై 10% అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ బోనస్‌లో భాగంగా పాత ఫోన్లను మార్చుకునే వారికి భారీ ఎక్స్ఛేంజ్ వాల్యూ, అలాగే ఎటువంటి అదనపు వడ్డీ లేని నో-కాస్ట్ ఈఎంఐ (No-cost EMI) సౌకర్యాన్ని కూడా సంస్థ కల్పిస్తోంది.

గమనిక: ఇటీవల యాపిల్ సంస్థ భారతదేశంలో మ్యాక్ మినీ, యాపిల్ టీవీ వంటి ఇతర ఉత్పత్తుల ధరలను 58% నుండి 74% వరకు భారీగా పెంచింది. ఐఫోన్ల ధరలు ఇంకా పెరగనప్పటికీ, భవిష్యత్తులో పెరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఐఫోన్ కొనాలనుకునే వారికి ఈ ‘GOAT Sale’ ఒక సువర్ణావకాశం అని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Next Story