- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాస్ బీట్ లోడింగ్.. ‘మకుటం’ సెకండ్ సింగిల్ విడుదలకు ముహూర్తం ఖరారు
‘మకుటం’ సినిమా నుండి సెకండ్ సింగిల్ విడుదలకు ముహూర్తం ఖరారు చేశారు మేకర్స్.

దిశ, సినిమా: వరుస సక్సెస్‌లతో జోరుమీదున్న విశాల్ తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. విశాల్ కెరీర్‌లో 35వ సినిమాగా రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌ను స్టార్ గ్రాఫ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ‘మకుటం’ సినిమాతో విశాల్ మెగా ఫోన్ పట్టనున్నారు. హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ సినిమాలో దుషారా విజయన్, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. రవి అరసు కథ అందించగా.. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన ఒక క్రేజీ మ్యూజికల్ అప్‌డేట్‌ను చిత్రబృందం తాజాగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ‘మకుటం’ సినిమా నుండి సెకండ్ సింగిల్ విడుదలకు ముహూర్తం ఖరారు చేశారు మేకర్స్. ఈ చిత్రంలోని అల్టిమేట్ మాస్ డాన్స్ నంబర్ ‘నచాకే వచ్చెరా’ పాటను ఈరోజు సాయంత్రం 7:00 గంటలకు అధికారికంగా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సాంగ్ సోషల్ మీడియా స్క్రీన్లను షేక్ చేయడమే కాకుండా, విజువల్స్ పరంగా ప్రేక్షకులకు ఒక హై-ఆక్టేన్ మ్యూజికల్ రైడ్‌ను అందించబోతోందని చిత్ర యూనిట్ ఎంతో నమ్మకంగా వెల్లడించింది.
ఈ పాటలో హీరో విశాల్ ఎనర్జిటిక్ మాస్ స్టెప్పులతో రచ్చ చేయబోతున్నట్లు తెలుస్తోంది. నేషనల్ అవార్డ్ విన్నర్ జీవీ ప్రకాష్ కుమార్ అందించిన ట్యూన్స్ సినిమాపై అంచనాలను పెంచేయగా.. ఈరోజు రాబోతున్న ‘నచాకే వచ్చెరా’ సాంగ్ మాస్ ఆడియన్స్‌ను, ముఖ్యంగా యువతను విపరీతంగా ఆకట్టుకునేలా ఉంటుందని ప్రమోషనల్ పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. విడుదలైన పోస్టర్‌లో అంజలి పూలతో ఉన్న పింక్ కలర్ చీర కట్టుకోగా.. అదే కలర్‌లో ఉన్న షర్ట్‌ను విశాల్ ధరించి గాగుల్స్ పెట్టుకుని అంజలిని హగ్ చేసుకుని స్టైల్‌గా నిల్చొని కనిపించారు. వారి చుట్టూరా కొన్ని డిజైన్ చేసిన కుండలు ఉండగా.. వెనకాల డ్యాన్స్ చేస్తూ కొంతమంది కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ అయింది. అయితే ఈ అప్‌డేట్ బయటకు వచ్చిన క్షణం నుండి సోషల్ మీడియాలో ‘మకుటం’ హ్యాష్ ట్యాగ్‌లు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.






