- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సమ్మర్ రేసులోకి మరో భారీ చిత్రం.. పెరుగుతున్న పోటీ
'బ్లడీ రోమియో' చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: కొన్ని సీజన్లలో సినిమాలు భారీ ఎత్తున విడుదల అవుతూ ఉంటాయి. అలా తెలుగు బాక్సాఫీస్ వద్ద ఎక్కువ సంఖ్యలో సినిమాలు విడుదలయ్యే ప్రధాన సీజన్లలో సమ్మర్ ఒకటి. ఈ ఏడాది పెద్దగా క్రేజ్ ఉన్న సినిమాలు వేసవి బరిలో నిలవలేదు. కానీ వచ్చే ఏడాది మాత్రం సమ్మర్ కానుకగా భారీ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే బాలకృష్ణ – కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాను వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అందుకు అనుగుణంగా చిత్రీకరణను కూడా వేగంగా పూర్తి చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం.
తాజాగా ఈ జాబితాలోకి మరో క్రేజీ మూవీ చేరినట్లు తెలుస్తోంది. నాని హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందనున్న 'బ్లడీ రోమియో' సినిమా షూటింగ్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలోని ప్రధాన భాగం షూటింగ్ లండన్‌లో జరగనున్నట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి, వచ్చే ఏడాది సమ్మర్ బరిలో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సమ్మర్ సీజన్‌కు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ, ఇప్పటికే ఈ రెండు క్రేజీ సినిమాలు వేసవి విడుదల లక్ష్యంగా తమ పనులను వేగవంతం చేశాయి. మరి రాబోయే రోజుల్లో ఇంకెన్ని భారీ చిత్రాలు ఈ లిస్టులో చేరతాయో చూడాలి.






