- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాహుల్ గాంధీ మిస్సింగ్.. రాజధానిలో పోస్టర్ల కలకలం
దేశ రాజధాని ఢిల్లీలోని ఫిరోజ్ షా రోడ్డుతో సహా పలు ప్రాంతాల్లో రాహుల్ గాంధీ కనిపించడం లేదని వెలిసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ విదేశీ పర్యటనకు వెళ్లారని బీజేపీ తీవ్రవిమర్శలు చేస్తున్న క్రమంలో.. దేశ రాజధాని ఢిల్లీలోని ఫిరోజ్ షా రోడ్డుతో సహా పలు ప్రాంతాల్లో ఆయన కనిపించడం లేదని వెలిసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. రాహుల్ గాంధీ ఫొటోతో పాటు మిస్సింగ్ అని రాసి ఉన్న పోస్టర్లు ఢిల్లీలోని ప్రముఖ కూడళ్లలో దర్శనమిచ్చాయి. పార్లమెంట్ సమావేశాలు, ఎన్నికలు, పార్టీకి అవసరం అయిన ప్రతిసారీ రాహుల్ గాంధీ అందుబాటులో ఉండరని బీజేపీ ఆరోపించిన మర్నాడే ఈ పోస్టర్లు వెలియడం చర్చకు దారితీసింది.
పీటీఐ కథనం ప్రకారం.. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై పదునైన విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ.. లీడర్ ఆఫ్ అపోజిషన్ కాదని, లీడర్ ఆఫ్ పర్యటన్ అని, లీడర్ ఆఫ్ పార్టీయింగ్ అని ఎద్దేవా చేశారు. ఆయన ఎప్పుడూ విందులు, వినోదాలు, పర్యటనలకే ప్రాధాన్యమిస్తారని, అందుకే తన పదవి పేరును లీడర్ ఆఫ్ పర్యటన్ అండ్ పార్టీయింగ్ గా మార్చుకోవాలని విమర్శించారు. రాహుల్ గాంధీకి తన రాజకీయ బాధ్యతల కంటే విదేశీ పర్యటనలే ముఖ్యమని బీజేపీ ప్రతినిధి ఆరోపించారు. ఆయనకు ప్రజలు, పార్లమెంటు లేదా దేశం మొదటి ప్రాధాన్యత కాదని, కేవలం పర్యాటకమే పరమావధి అని మండిపడ్డారు. ప్రధాని మోడీ అత్యంత సుదీర్ఘకాలం పనిచేసిన నేతగా ఉంటే.. రాహుల్ మాత్రం సెలవుల్లో గడపడానికే ప్రాధాన్యతనిస్తారని విమర్శించారు.






