- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పర్యావరణ పరిరక్షణకు ఫ్రీ మసూన్స్ ఆఫ్ తెలంగాణ పిలుపు
పర్యావరణాన్ని పరిరక్షించినప్పుడే భావితరాలకు భవిష్యత్తు ఉంటుందని, భావితరాలను కాపాడుకోవాలంటే పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఫ్రీ మసూన్స్ ఆఫ్ తెలంగాణ ప్రతినిధులు పేర్కొన్నారు.

దిశ, హిమాయత్‌నగర్ : పర్యావరణాన్ని పరిరక్షించినప్పుడే భావితరాలకు భవిష్యత్తు ఉంటుందని, భావితరాలను కాపాడుకోవాలంటే పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఫ్రీ మసూన్స్ ఆఫ్ తెలంగాణ ప్రతినిధులు పేర్కొన్నారు. ఆదివారం ట్యాంక్‌బండ్ మహావీర్ విగ్రహం నుంచి ఫ్రీ మసూన్స్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో వాక్‌థాన్ నిర్వహించారు. దక్షిణ భారతదేశానికి చెందిన సభ్యులు సమాజంలోని సభ్యులందరి మధ్య సోదరభావాన్ని చాటిచెబుతూ, సోదర ప్రేమ, దాతృత్వం, సమానత్వం వంటి అద్భుతమైన విలువలను ప్రోత్సహించే విధంగా వాక్‌థాన్‌ను నిర్వహించినట్లు ప్రతినిధులు తెలిపారు. వాక్‌థాన్‌లు, మారథాన్‌లు భారతదేశం అంతటా నిర్వహిస్తున్నామని వారు వివరించారు. ప్రకృతిని రక్షించండి.. భవిష్యత్తును రక్షించండి అనే పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఒకప్పుడు తమ సంస్థలో సభ్యునిగా స్వామి వివేకానంద కూడా ఉండేవారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శంకర్‌లాల్ బల్దావా, సపన్ కుమార్ పాండా, కె. హరీష్ చంద్ర్, అల్లా పురుషోత్తం రావు, పేర్ల ప్రభాకర్, జో ఫెర్నాండెజ్, ముక్కామి ఆనంద్, గంప నాగేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.






