- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆంజనేయుడి అనుగ్రహంతో కరవు కాటకాలు తొలగాలి
ఆంజనేయ స్వామి అనుగ్రహంతో వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.

దిశ, నంగునూరు: ఆంజనేయ స్వామి అనుగ్రహంతో వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. నంగునూరు మండల కేంద్రంలో జరిగిన శ్రీభక్తాంజనేయ స్వామి పునః ప్రతిష్ఠా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావంతో కరువు ఏర్పడుతుందని అంటున్నారని చెప్పారు. ఆంజనేయ స్వామి అనుగ్రహించి కరువును నివారించి వర్షాలు సమృద్ధిగా కురిపించాలని ప్రార్థించారు. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. వేయి సంవత్సరాల కిందట రాష్ట్రకూటుల కాలంలో నిర్మించిన భక్తాంజనేయ స్వామి దేవాలయ పునః ప్రతిష్ఠా కార్యక్రమం జరగడం సంతోషకరమని చెప్పారు. స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. స్వామి వారి అనుగ్రహతో భవిష్యత్తులో నంగునూరు గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పురోహితుడు ఆదిరాల సాయినాథ శర్మ, ప్రముఖ వేద పండితుడు జనమంచి సీతారామ శర్మ, పూజారి రామాచారి స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి హరీశ్ రావుకు వేద ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి సనాదుల బాలపోచయ్య, ఉప సర్పంచి కోల శ్రీధర్ గౌడ్, నంగునూరు పీఏసీఎస్ ఛైర్మన్ కోల రమేశ్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు జయపాల్ రెడ్డి, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.






