- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సినిమాను, భాషను కలపొద్దు: ‘ఇడుపు కాయితం’ వివాదంపై నటుడు నరేశ్ రియాక్షన్
సినిమాను, భాషను కలపొద్దని సీనియర్ నటుడు నరేశ్ అన్నారు. ‘ఇడుపు కాయితం’ సినిమా టైటిల్‌పై నెలకొన్న వివాదంపై ఆయన స్పందించారు. మాండలికాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, హేళన చేయకూడదని నరేశ్ తెలిపారు. తెలుగు భాష చాలా గొప్పదని ఇలాంటి వివాదాలతో మనకొమ్మను మనమే నరుక్కుంటున్నామన్నారు..

దిశ, వెబ్ డెస్క్: సినిమా(Cinema)ను, భాష(Language)ను కలపొద్దని సీనియర్ నటుడు నరేశ్ అన్నారు. ‘ఇడుపు కాయితం’ సినిమా టైటిల్‌పై నెలకొన్న వివాదంపై ఆయన స్పందించారు. మాండలికాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, హేళన చేయకూడదని నరేశ్ తెలిపారు. తెలుగు భాష చాలా గొప్పదని ఇలాంటి వివాదాలతో మనకొమ్మను మనమే నరుక్కుంటున్నామన్నారు. ఎవరో నెటిజన్ పెట్టిన పోస్టును తీసుకుని కొందరు పనిగట్టుకుని నేషనల్ సమస్యగా మారుస్తున్నారని మండిపడ్డారు. దీన్ని చాలా వివాదం చేసి గొప్ప మాండలికాన్ని అవమానం చేయడాన్ని తెలుగువాళ్లగా మనమందరం సిగ్గుతో తలదించుకోవాలన్నారు.
మాండలికాలకు ఏళ్ల చరిత్ర
తెలంగాణ, రాయలసీమ, కోనసీమ, ఉత్తరాంధ్ర మాండలికాలకు ఎంతో చరిత్ర ఉందని తెలిపారు. ముందు తెలుగువాళ్లమని, ఆ తర్వాత భారతీయులమని ఎంతో గర్వంగా చెప్పుకుంటామని, సినిమా టైటిల్‌ను తీసుకుని మాట్లాడటం చాలా బ్యాడ్ అని వ్యాఖ్యానించారు. సినిమాను, సినిమాలాగే చూడాలని చెప్పారు. అర్ధాలు తెలియకపోయినా కరుప్పు, కాంతార వంటి సినిమాలను హిట్ చేయలేదా అని నరేశ్ ప్రశ్నించారు. సినిమాను, భాషను కలపొద్దని, ఆ బాధ్యతను తెలుగు భాష సంఘం సభ్యులు తీసుకోవాలని చెప్పారు. తెలుగు భాష సంఘం సభ్యులు వివిధ ప్రాంతాల్లో ఉన్నారని, అందరూ కూడా బాధ్యతగా తీసుకుని, ఈ వివాదాన్ని ఇంతటితో ముగిద్దామని నటుడు నరేశ్ పిలుపునిచ్చారు.






