బాచుపల్లి రాజీవ్ గాంధీనగర్ లో విషాదం..

by Batti.Sumithra |   (  Updated:2026-06-28 14:05:59  IST  )

బాచుపల్లిలో విషాదఘటన చోటు చేసుకుంది. బాచుపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలోని బైరుని చెరువులో ఈతకు వెళ్లిన 13 ఏళ్ల బాలుడు మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది.

బాచుపల్లి రాజీవ్ గాంధీనగర్ లో విషాదం..
X

దిశ, కుత్బుల్లాపూర్ : బాచుపల్లిలో విషాదఘటన చోటు చేసుకుంది. బాచుపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలోని బైరుని చెరువులో ఈతకు వెళ్లిన 13 ఏళ్ల బాలుడు మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. మృతుడు ఎ.సాయి చరణ్ (13)గా పోలీసులు గుర్తించారు. సాయి చరణ్ బాచుపల్లి రాజీవ్ గాంధీ నగర్, రోడ్ నెం.1లో నివాసం ఉంటూ స్థానికంగా 7వ తరగతి చదువుతున్నాడు. సమాచారం అందుకున్న బాచుపల్లి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసునమోదు చేసి, ప్రమాదానికి గల కారణాల పై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలుడి మృతితో రాజీవ్ గాంధీ నగర్ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Next Story