- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చుక్కల మందుకు... చక్కని స్పందన
లింగంపేట మండలంలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమానికి ప్రజల నుంచి చక్కని స్పందన లభించినట్లు స్థానిక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్ హిమబిందు తెలిపారు.

దిశ, లింగంపేట : లింగంపేట మండలంలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమానికి ప్రజల నుంచి చక్కని స్పందన లభించినట్లు స్థానిక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్ హిమబిందు తెలిపారు. మండలంలో 0 నుంచి 5 సంవత్సరాల లోపు మొత్తం 4,985 మంది చిన్నారులు ఉండగా, వారిలో 4,930 మంది చిన్నారులకు పల్స్ పోలియో చుక్కల మందు వేసినట్లు ఆమె వెల్లడించారు. మిగిలిన 55 మంది చిన్నారులకు కూడా వచ్చే రెండు రోజుల్లో పోలియో చుక్కలు వేయించి వంద శాతం లక్ష్యాన్ని పూర్తి చేస్తామని పేర్కొన్నారు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయడం ఎంతో అవసరమని, తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి పూర్తి సహకారం అందించాలని ఆమె కోరారు. లింగంపేటలో చేపడుతున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకట్ పరిశీలించి, కార్యక్రమం నిర్వహణ తీరును సమీక్షించారు.






