రోయింగ్ వరల్డ్ కప్‌లో భారత్ న్యూ రికార్డ్

by Muthe.Rajitha |

ప్రపంచ రోయింగ్ వేదికపై భారత అథ్లెట్లు సరికొత్త రికార్డు సృష్టించారు.

రోయింగ్ వరల్డ్ కప్‌లో భారత్ న్యూ రికార్డ్
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచ రోయింగ్ వేదికపై భారత అథ్లెట్లు సరికొత్త రికార్డు సృష్టించారు. ప్రతిష్టాత్మక '2026 వరల్డ్ రోయింగ్ కప్-III' లో మైండ్ బ్లోయింగ్ ప్రదర్శనతో గోల్డ్ మెడల్ సొంతం చేసుకున్నారు. వరల్డ్ రోయింగ్ కప్ ఈవెంట్ చరిత్రలోనే దేశానికి బంగారు పతకం రావడం ఇదే మొట్టమొదటిసారి కావడం విశేషం. లైట్ వెయిట్ మెన్స్ డబుల్ స్కల్స్ (Lightweight Men's Double Sculls) ఫైనల్ రేసులో భారత ఆర్మీకి చెందిన ఉజ్వల్ కుమార్, లక్షయ్ జోడీ అత్యంత వేగంగా 6:26.09 నిమిషాల్లో గమ్యాన్ని చేరుకుని అగ్రస్థానంలో నిలిచింది. భారత రోయర్లు భారత ఆర్మీలో (Indian Army) విధులను నిర్వర్తిస్తున్నారు. దేశంలో రోయింగ్ క్రీడను అభివృద్ధి చేసేందుకు గత కొన్నేళ్లుగా భారత మిలటరీ భారీగా నిధులను వెచ్చిస్తోంది. వరల్డ్ రోయింగ్ కప్ ఫైనల్స్ రేసులో భారత జోడీకి ప్రపంచ స్థాయి రోయర్ల నుండి అత్యంత కఠినమైన పోటీ ఎదురైంది. ముఖ్యంగా హాంకాంగ్, నెదర్లాండ్స్ జట్లు భారత్‌కు గట్టి సవాలును విసిరినప్పటికీ.. చివరి సెకను వరకు పోరాడి టీమిండియాను విజయతీరాలకు చేర్చారు.

Next Story