మహిళలు అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవాలి : ఎమ్మెల్యే రేవూరి

by Batti.Sumithra |

మహిళలు అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పరకాల శాసన సభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి స్పష్టం చేశారు.

మహిళలు అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవాలి : ఎమ్మెల్యే రేవూరి
X

దిశ, గీసుకొండ : మహిళలు అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పరకాల శాసన సభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి స్పష్టం చేశారు. మహిళల ఆర్థికాభివృద్ధి, సాధికారతే ప్రభుత్వ ప్రధాన సంకల్పమని తెలిపారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 15, 16, 17వ డివిజన్ల మహిళా సమైక్య గ్రూపు సభ్యులకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం ఆదివారం గీసుగొండ మండలం కొనయమాకుల గ్రామ పరిధిలోని ఓ పంక్షన్ హల్లో గార్డెన్‌లో ఘనంగా జరిగింది. హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదతో కలిసి ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి లబ్ధిదారులకు చీరలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పరకాల మహిళా డైరీలో ప్రతి మహిళ భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. అర్హులైన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరలు పారదర్శకంగా, ప్రణాళికాబద్ధంగా అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Next Story