- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజా పోరాటాలతోనే అధికారంలోకి వస్తాం.. బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్
తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే అభివృద్ధి సాధ్యమని బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్ స్పష్టం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రజాసేవ, పోరాటాలతోనే తెలంగాణలో అధికారంలోకి వస్తామని బీజేపీ (BJP) జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్ (Nitin Nabin) అన్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ హైదరాబాద్ చేరుకున్న ఆయన రంగారెడ్డి గ్రామీణ జిల్లా బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం శంషాబాద్ వేదిక నిర్వహించిన సభలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కామారెడ్డి, సిద్దిపేట, మెదక్, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల బీజేపీ కార్యాలయాలను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్బంగా నితిన్ నబీన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో విపక్షంలో ఉన్న బీజేపీ ప్రజా పోరాటాలు చేయాలని కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పోరాడాలని దిశానిర్దేశం చేశారు. ప్రజాసేవ, పోరాటాల ద్వారానే అధికారంలోకి రాగలుగుతామని నితిన్ నబీన్ అన్నారు.
పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొస్తానని ప్రతి కార్యకర్త సంకల్పించుకోవాలని నితిన్ నబీన్ అన్నారు. పశ్చిమ బెంగాల్ (West Bengal)లో కార్యకర్తల సంకల్పం వల్లే ఘన విజయం సాధించామని అన్నారు. బెంగాల్‌ను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణలో కార్యకర్తలు, నాయకులు పొరాడాలని పిలుపునిచ్చారు. ఏక్ భారత్-శ్రేష్ట్ భారత్ లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) కృషి చేస్తున్నారని అన్నారు. త్వరలో తెలంగాణ కాషాయ జెండా ఎగరాలని ఆకాంక్షించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే.. తెలంగాణ అభివృద్ధి జరుగుతోందని అన్నారు. లోక్‌సభలో 2 సీట్లతో ప్రారంభమైన బీజేపీ ఇప్పుడు అప్రతిహతంగా సాగుతోందని కామెంట్ చేశారు. తెలంగాణ ఏర్పాటు కోసం సుష్మా స్వరాజ్ (Sushma Swaraj) ఎంతో పోరాడారని గుర్తు చేశారు. నాడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ వల్లే తెలంగాణ సాకరమైందని నితిన్ నబీన్ అన్నారు.






