- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం: కలెక్టర్ సీహెచ్ ప్రియాంక
ఐదేళ్ళలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజాన్ని నిర్మించాలని జిల్లా కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక పిలుపునిచ్చారు.

దిశ, నారాయణపేట ప్రతినిధి: ఐదేళ్ళలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజాన్ని నిర్మించాలని జిల్లా కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో నిర్దేశించిన లక్ష్యం మేరకు ప్రతి ఒక్క చిన్నారికి పోలియో చుక్కలు వేయాలన్నారు. O నుంచి 5 సంవత్సరాల లోపు ఉన్న చిన్నారులందరికీ తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు కలెక్టర్ సూచించారు. జిల్లాలో ఎంతమంది చిన్నారులు ఉన్నారు? ఎన్ని కేంద్రాలను ఏర్పాటు చేశారని, అవసరమైన డోసుల వాక్సిన్ అందుబాటులో ఉందా అని ప్రోగ్రామ్ అధికారిని ఆమె అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పుర చైర్ పర్సన్ కొండా శ్వేతా సత్య యాదవ్, వైస్ చైర్ పర్సన్ మంజుల, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జయ చంద్రమోహన్, కౌన్సిలర్లు ప్రభాకర్, రాజేష్ ఘట్, ఆర్ఎంవో డాక్టర్ బాలాజీ, ఏఎన్ ఎం సువిశేషమ్మ, అంగన్ వాడీ టీచర్లు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






