- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇసుక దందాను ఆపకపోతే ఆందోళనే: మాజీ ఎమ్మెల్యే
ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణపై మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆరోపించారు.

దిశ, తిమ్మాపూర్: నియోజకవర్గంలో ఎక్కడ వాగులు ఉన్నా ఆ వాగుల్లోని ఇసుకను చెరబట్టి అమ్ముకునేందుకు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సిద్దపడ్డాడని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆరోపించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలోని ఇసుక క్వారీని ఆయన బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మానేరులో మట్టి పూడికతీత పేరుతో అక్రమంగా ఇసుక తరలింపు జరుగుతోందని ఆరోపించారు. భారీ డంపులు ఏర్పాటు చేసి రాత్రి వేళల్లో లారీల ద్వారా ఇసుకను తరలిస్తున్నారని విమర్శించారు. షాడో ఎమ్మెల్యే నేతృత్వంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ నియోజకవర్గంలోని కొత్తపెల్లి, రేణికుంట, ఉటూరు, పొత్తురు తదితర ప్రాంతాల్లోని వాగుల్లో ఇసుకను బహిరంగంగా దోపిడీ చేస్తూ అమ్ముకుంటున్నారని విమర్శించారు. సంబంధిత అధికారులు పర్యవేక్షణ చేయకపోవడంతో అక్రమాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇసుక తవ్వకాల వల్ల భూగర్భ జలాలు తగ్గి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ దోపిడీకి సహకరిస్తున్న స్థానిక అధికారులకు ముడుపులు ఇస్తూ.. ప్రశ్నించే వారిని బదిలీ చేస్తున్నారని పేరొన్నారు. పోలీసు, మైనింగ్, రెవెన్యూ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి అక్రమ ఇసుక దందాను వెంటనే నిలిపివేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు, ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమం లో పార్టీ జిల్లా అధ్యక్షుడు జి. వి. రామకృష్ణా రావు, ఆయా మండలాల నాయకులు పాల్గొన్నారు.






