- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ గిరిజన సంఘం నాలుగో రాష్ట్ర మహాసభలు.. విజయవంతం చేయాలని పిలుపు
తెలంగాణలో గిరిజనుల హక్కుల పరిరక్షణ, అభివృద్ధి కోసం మూడు దశాబ్దాలుగా నిరంతర పోరాటం చేస్తున్న తెలంగాణ గిరిజన సంఘం నాలుగో రాష్ట్ర మహాసభలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి.

దిశ, చంపాపేట్ : తెలంగాణలో గిరిజనుల హక్కుల పరిరక్షణ, అభివృద్ధి కోసం మూడు దశాబ్దాలుగా నిరంతర పోరాటం చేస్తున్న తెలంగాణ గిరిజన సంఘం నాలుగో రాష్ట్ర మహాసభలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో జులై 5న నిర్వహించనున్న ఆహ్వాన కమిటీ సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరుతూ గిరిజన సంఘం హైదరాబాద్ సౌత్ కమిటీ ప్రతినిధులు హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు కమిషనర్ రాందాస్ తేజను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం. ధర్మ నాయక్, రాష్ట్ర కార్యదర్శి ఆర్. శ్రీరామ్ నాయక్ మాట్లాడుతూ గత ముప్పై ఏళ్లుగా గిరిజన ప్రజల హక్కుల సాధన కోసం తెలంగాణ గిరిజన సంఘం అనేక ఉద్యమాలు నిర్వహించిందన్నారు.
ముఖ్యంగా పోడు భూములకు హక్కు పట్టాలు మంజూరు చేయాలని ప్రభుత్వాల పై ఒత్తిడి తీసుకురావడంతో పాటు, గిరిజన యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నిరంతరం పోరాటం సాగించిందని తెలిపారు. రానున్న సెప్టెంబర్ 27, 28 తేదీల్లో హైదరాబాద్ సౌత్ పరిధిలో తెలంగాణ గిరిజన సంఘం నాలుగో రాష్ట్ర మహాసభలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ మహాసభలు గిరిజన సమాజ భవిష్యత్ దిశను నిర్దేశించే కీలక వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు. మహాసభల విజయవంతానికి తొలి అడుగుగా జులై 5న నిర్వహించనున్న ఆహ్వాన కమిటీ సమావేశానికి గిరిజన ప్రభుత్వ అధికారులు, సామాజికవేత్తలు, మేధావులు, రాజకీయ విశ్లేషకులు, ప్రజాప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు, గిరిజన సంఘాల నాయకులు, సానుభూతిపరులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం హైదరాబాద్ సౌత్ జిల్లా కార్యదర్శి ఎం. బాలు నాయక్, నితీష్, ఎస్. కిషన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.






