త్వరలో తెలంగాణలో అధికారంలోకి వస్తాం: కిషన్ రెడ్డి

by Ajay Maddhiboyina |

త్వ‌ర‌లో తెలంగాణ‌లో బీజేపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి అన్నారు. నాంప‌ల్లిలో జ‌రిగిన బీజేపీ స‌భ‌లో ఆయ‌న మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ అవినీతి పార్టీలేన‌ని విమ‌ర్శించారు.

త్వరలో తెలంగాణలో అధికారంలోకి వస్తాం: కిషన్ రెడ్డి
X

దిశ‌, వెబ్ డెస్క్: త్వ‌ర‌లో తెలంగాణ‌లో బీజేపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి అన్నారు. నాంప‌ల్లిలో జ‌రిగిన బీజేపీ స‌భ‌లో ఆయ‌న మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ అవినీతి పార్టీలేన‌ని విమ‌ర్శించారు. హైద‌రాబాద్ ను ఈ రెండు పార్టీలు మ‌జ్లిస్ కు దారాద‌త్తం చేశాయ‌ని మండిప‌డ్డారు. కాబట్టి హైద‌రాబాద్ ప్ర‌జ‌లు ఆలోచించాల‌ని, బీజేపీకి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోరారు. రాష్ట్రంలో డ‌బుల్ ఇంజిన్ స‌ర్కార్ రావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఎస్ఐఆర్ ప్ర‌క్రియ చేప‌డితే కాంగ్రెస్, బీఆర్ఎస్, మ‌జ్లిస్ పార్టీలు ఎందుకు ఉలిక్కిప‌డుతున్నాయ‌ని ప్ర‌శ్నించారు. ఇంటిటి స‌ర్వేకు వెళ్లేది తెలంగాణ ఉద్యోగ‌స్తులేన‌ని, ఉద్యోగుల‌పై కాంగ్రెస్, బీఆర్ఎస్ కు న‌మ్మ‌కం లేదా అని అడిగారు.

వారిని అవ‌మానించేలా మాట్లాడుతున్నార‌ని మండిప‌డ్డారు. పాత‌బ‌స్తీలో అనేక దొంగ‌నోట్లు ఉన్నాయ‌ని అక్క‌డ రోహింగ్యాలు, బంగ్లాదేశ్ నుండి వ‌చ్చిన వాళ్లు ఉన్నార‌ని చెప్పారు. ఈ దేశం కానివాళ్ల పేర్లు ఓట‌ర్ లిస్టులో ఉండ‌టానికి వీలు లేద‌ని అన్నారు. హైద‌రాబాద్ ను ర‌క్షించ‌డం కోసం ప్ర‌జ‌లంతా ఎస్ఐఆర్ లో పాల్గొనాల‌ని అన్నారు. ఇది వ‌ర‌కు ఎస్ఐఆర్ ఏడెనిమిది సార్లు జ‌రిగిందని అప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వ‌చ్చింద‌ని ప్ర‌శ్నించారు. ఏ జిల్లా అయినా, ఏ రాష్ట్రం అయినా హైద‌రాబాద్ లో ఉంటే వాళ్లు ఓటు హ‌క్కును ఇక్క‌డికి మార్పించుకోవ‌చ్చ‌ని అన్నారు. ఎప్పుడైనా ఓట‌రు తాము నివాసం ఉంటున్న ప్రాంతానికి ఓటును మార్చుకోవ‌చ్చ‌ని చెప్పారు.

Next Story