ఏఓబీలో భారీగా నాటుసారా... రెండు రాష్ట్రాల పోలీసుల మెరుపు దాడి

by Vemula.Srinu Prasad |

ఆంధ్రప్రదేశ్ - ఒడిశా సరిహద్దు గ్రామాల్లో నాటు సారా తయారీ యదేచ్ఛగా జరుగుతోంది. దీంతో పార్వతీపురం మన్యం జిల్లా పోలీసులు, ఒడిశా ఎక్సైజ్ సిబ్బంది మెరుపు దాడులు చేశారు. అనిజ, వలవ గ్రామాల్లోని పలు అనుమానాస్పద స్థావరాలను అధికారులు జల్లెడ పట్టారు...

ఏఓబీలో భారీగా నాటుసారా... రెండు రాష్ట్రాల పోలీసుల మెరుపు దాడి
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ - ఒడిశా (AOB) సరిహద్దు గ్రామాల్లో నాటు సారా తయారీ యదేచ్ఛగా జరుగుతోంది. దీంతో పార్వతీపురం మన్యం జిల్లా పోలీసులు, ఒడిశా ఎక్సైజ్ సిబ్బంది మెరుపు దాడులు చేశారు. అనిజ, వలవ గ్రామాల్లోని పలు అనుమానాస్పద స్థావరాలను అధికారులు జల్లెడ పట్టారు. నాటుసారా తయారీ కోసం పెద్ద ఎత్తున సిద్ధం చేసి ఉంచిన డ్రమ్ములను గుర్తించారు. సారా కాసేందుకు నిల్వ ఉంచిన సుమారు 11,000 లీటర్ల పులిసిన బెల్లం ఊటను అధికారులు పారబోశారు. అలాగే బెల్లం ఊటతో పాటు విక్రయానికి సిద్ధంగా ఉంచిన 220 లీటర్ల నాటుసారాకు నిప్పు పెట్టి ధ్వంసం చేశారు. అక్రమ నాటుసారా తయారీ కేంద్రాలపై నిరంతరం నిఘా ఉంచుతామని పోలీసులు హెచ్చరించారు. సరిహద్దు గ్రామాల్లో ఎవరైనా సారా కాసినా, రవాణా చేసినా కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. అక్రమ మద్యం సమాచారం తెలిస్తే ప్రజలు వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరారు.

Next Story