- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కల్వకుర్తి అభివృద్ధికి భారీ ఊతం.. 28 బీటీ రోడ్లకు గ్రీన్ సిగ్నల్
కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించే దిశగా మరో కీలక ముందడుగు పడింది.

దిశ, తలకొండపల్లి: కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించే దిశగా మరో కీలక ముందడుగు పడింది. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రత్యేక చొరవ, నిరంతర కృషి, ప్రభుత్వ స్థాయిలో చేసిన సమర్థవంతమైన ప్రతిపాదనల ఫలితంగా హెచ్‌ఏఎం (హైబ్రిడ్ యాన్యుటీ మోడల్) తొలి దశలో నియోజకవర్గానికి భారీ స్థాయిలో రహదారి అభివృద్ధి పనులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. ఖానాపూర్ గ్రామంలో తన తండ్రి సంస్మరణ కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, పంచాయతీరాజ్ మరియు రోడ్లు–భవనాల శాఖల పరిధిలో మొత్తం 28 బీటీ రోడ్ల పునర్నిర్మాణానికి అనుమతులు లభించాయని చెప్పారు. దాదాపు 160 కిలోమీటర్ల మేర రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు.
ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోని రహదారులను ఆధునిక ప్రమాణాలతో పునర్నిర్మించి గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో కల్వకుర్తి నియోజకవర్గాన్ని హెచ్‌ఏఎం తొలి దశలో ప్రత్యేకంగా ఎంపిక చేసినట్లు వివరించారు. ఈ పనులు పూర్తయితే గ్రామాల మధ్య అనుసంధానం మరింత మెరుగుపడటంతో పాటు ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణ వసతులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న సహకారం, ప్రజల ఆశీర్వాదంతో భవిష్యత్తులో మరిన్ని మౌలిక వసతుల అభివృద్ధి పనులు చేపట్టేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారఅనంతరం వెంకట్రావుపేట గ్రామంలో కమటం సురేందర్ తల్లి జంగమ్మ దశదినకర్మకు హాజరై ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అదే గ్రామానికి చెందిన గౌస్ తల్లి బువ్వమ్మ అనారోగ్యంతో మృతిచెందిన విషయం తెలుసుకుని ఆమె పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడు బాలాసింగ్, పీసీసీ సభ్యుడు శ్రీనివాస్ గౌడ్, ఏఎంసీ చైర్‌పర్సన్ యాట గీతా నరసింహ, ఉపాధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, ఆమనగల్ బ్లాక్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రమాదేవి, పీఏసీఎస్ చైర్‌పర్సన్ కేశవరెడ్డి, సర్పంచ్ కాసు శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ లక్ష్మీదేవి రఘురాములు, ఏఎంసీ డైరెక్టర్లు, మాజీ సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.






