రెండు పోలియో చుక్కలతో చిన్నారుల జీవితాల్లో భరోసా

by Ratna Kumari |

పోలియో నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా రెండు పోలియో చుక్కలు వేయించాలని మండల వైద్యాధికారి డాక్టర్ సురేష్ అన్నారు.

రెండు పోలియో చుక్కలతో చిన్నారుల జీవితాల్లో భరోసా
X

దిశ, కారేపల్లి : పోలియో నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా రెండు పోలియో చుక్కలు వేయించాలని మండల వైద్యాధికారి డాక్టర్ సురేష్ అన్నారు. కారేపల్లి మండల పరిధిలో పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం బల్లునగర్‌లో ఏర్పాటు చేసిన పోలియో బూత్‌ను డాక్టర్ సురేష్ సందర్శించి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. అనంతరం సింగరేణి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని పోలియో బూత్‌తో పాటు కారేపల్లి కూడలిలో ఏర్పాటు చేసిన రవాణా కేంద్ర పోలియో బూత్‌ను పరిశీలించారు ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. మండలంలో ఐదేళ్లలోపు 5,069 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడాన్ని లక్ష్యంగా నిర్దేశించగా, తొలి రోజే 4,748 మంది చిన్నారులకు చుక్కలు వేయడం ద్వారా 94 శాతం లక్ష్యాన్ని సాధించినట్లు తెలిపారు. మిగిలిన చిన్నారులకు ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేయించి వంద శాతం లక్ష్యాన్ని చేరుకునేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పర్యవేక్షకుడు నరసింహారావు, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story