- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ క్రియేటివ్ డైరెక్టర్ గా రాజ్ కొండా
by Batti.Sumithra |
గత కొంతకాలంగా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి దగ్గర డిజైనర్ గా పని చేసే రాజ్ కొండాను ప్రభుత్వ క్రెయేటివ్ డైరెక్టర్ గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.

X
దిశ, హిమాయత్ నగర్ : గత కొంతకాలంగా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి దగ్గర డిజైనర్ గా పని చేసే రాజ్ కొండాను ప్రభుత్వ క్రెయేటివ్ డైరెక్టర్ గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ ముకుంద రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. సమాచార శాఖలో మూడేళ్ళ పాటు ఒప్పంద ప్రాతిపదికన నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. తూప్రాన్ కు చెందిన రాజ్ కొండా మల్కాజిగిరిలో రేవంత్ రెడ్డి ఎంపీగా పోటీ చేసినప్పటి నుంచి ఆయనకు సంబంధించిన ప్రచార పోస్టర్లు డిజైన్స్ చేస్తున్నారు. ఇప్పుడిక అధికారికంగా ప్రభుత్వ జీతంతో అదే విధుల్లో కొనసాగుతారు.
Next Story






