- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Health : టమాటాలు తింటే ప్రొస్టేట్ క్యాన్సర్ రిస్క్ తగ్గుతుందా..?
టమాటాల్లో ఉండే లైకోపీన్ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ శరీరంలో ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించి, క్యాన్సర్ కణాల అభివృద్ధిని నిరోధిస్తుంది.

దిశ, ఫీచర్స్ : రోజువారీ ఆహారంలో భాగంగా మనం అనేక రకాల కూరగాయలు తింటుంటాం. ప్రతీ కూరగాయ ఏదో ఒక ఆరోగ్య ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది. అలాంటి వాటిలో టమాటా కూడా ఒకటి. అయితే టమాటాలను రెగ్యులర్‌గా తినేపురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ చాలా వరకు తగ్గుతుందని హార్వర్డ్ T.H. చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధనలో వెల్లడైంది. ఇంకా ఏయే హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
64% వరకు తగ్గుతున్న రిస్క్
పరిశోధనల ప్రకారం.. టమాటాలలో లైకోపీన్ (lycopene) అనే యాంటీఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటుంది. ఇది ప్రొస్టేట్ క్యాన్సర్ (Prostate cancer) ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. పలు ఇతర అధ్యయనాలు కూడా రెగ్యులర్‌గా టమాటాలు తినే వారిలో ఈ క్యాన్సర్ రిస్క్ 64% వరకు తగ్గవచ్చని పేర్కొన్నాయి. ముఖ్యంగా వండుకొని లేదా వివిధ కూరల్లో కలిపి వండుకొని తినడం మంచిది. టమాటా సాస్, అలాగే టమాటా కలిపిన కొన్ని రకాల ఉత్పత్తులు కూడా ఇదే ప్రయోజనాన్ని కలిగిస్తాయని నిపుణులు అంటున్నారు. ఇది క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేసే మందు కాదు, కానీ దీర్ఘకాలిక ఆరోగ్య రక్షణలో భాగంగా ప్రొస్టేట్ క్యాన్సర్ నివారణలో ఉపయోగపడుతుందని పరిశోధకులు అంటున్నారు.
ఆ పదార్థమే కారణం..
టమాటాల్లో ఉండే లైకోపీన్ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ శరీరంలో ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించి, క్యాన్సర్ కణాల అభివృద్ధిని నిరోధిస్తుంది. ముఖ్యంగా ప్రొస్టేట్ క్యాన్సర్‌లో అధునాతన రూపాల (advanced) ప్రమాదాన్ని తగ్గించడంలో ఎక్కువ ప్రభావం చూపుతుంది. వారానికి 2-4 సార్లు టమాటా సాస్ లేదా వండిన టమాటా ఉత్పత్తులు తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. పచ్చి టమాటాల కంటే కూడా వండిన టమాటాల్లో లైకోపీన్ ఎక్కువ. పైగా శరీరం వండిన టమాటాల్లోని రుచిని, లైకోపీన్‌ని బాగా గ్రహించగలదు. అందుకే రోజువారీ ఆహారంలో టమాటాలను చేర్చడం సులభమైన, సహజమైన ఆరోగ్య రక్షణ వ్యూహంగా నిపుణులు పేర్కొంటున్నారు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






