- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిరుత సంచారం పై అప్రమత్తం..!
నర్సంపేట రేంజ్ పరిధిలోని ఖానాపూర్ మండలం, గూడూరు వన్యప్రాణి విభాగానికి ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతాల్లో చిరుత పులి సంచరిస్తున్నట్లు సమాచారం అందిన నేపథ్యంలో కొత్తగూడ మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కొత్తగూడ అటవీ శాఖ అధికారి వంశీకృష్ణ సూచించారు.

దిశ, కొత్తగూడ : నర్సంపేట రేంజ్ పరిధిలోని ఖానాపూర్ మండలం, గూడూరు వన్యప్రాణి విభాగానికి ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతాల్లో చిరుత పులి సంచరిస్తున్నట్లు సమాచారం అందిన నేపథ్యంలో కొత్తగూడ మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కొత్తగూడ అటవీ శాఖ అధికారి వంశీకృష్ణ సూచించారు. ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో అటవీ శాఖ అధికారి వంశీకృష్ణ మాట్లాడుతూ చిరుత కదలికల పై అటవీ శాఖ ప్రత్యేక నిఘా కొనసాగిస్తోందని, ప్రజలు భయాందోళనలకు గురి కాకుండా అప్రమత్తంగా ఉండి అటవీ శాఖకు సహకరించాలని అడవికి ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలు అవసరం లేకుండా అటవీ ప్రాంతాల్లోకి వెళ్లరాదని, పశువులు, గొర్రెలను అడవిలో మేపేందుకు పంపవద్దని సూచించారు.
మహిళలు, చిన్నారులు సాయంత్రం వేళల్లో, రాత్రి సమయంలో ఒంటరిగా బయటకు వెళ్లకుండా కుటుంబ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. చిరుతపులి కనిపించినా, అడుగుల జాడలు గుర్తించినా లేదా సంచారం ఉన్నట్లు అనుమానం వచ్చినా దానికి ఎలాంటి హాని కలిగించే ప్రయత్నం చేయవద్దని, వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని ప్రజలు వదంతులను నమ్మకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమాచారం అందించేందుకు ఎఫ్.ఎస్.ఓ. హట్టి సింగ్ (94405 87017), ఎఫ్.బి.ఓ. సాగర్ (95026 88782)ను వెంటనే సంప్రదించాలని అటవీ శాఖ అధికారి వంశీకృష్ణ విజ్ఞప్తి చేశారు.






