- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫుడ్ పాయిజన్.. బజ్జీలు తిన్న 50 మందికి అస్వస్థత
కాకినాడ జిల్లా దుగ్గుదుర్రు గ్రామంలో ఫుడ్ పాయిజన్ అయింది. సుమారు 50 మంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు....

దిశ, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లా(Kakinada District)దుగ్గుదుర్రు గ్రామం(Duggudurru Village)లో ఫుడ్ పాయిజన్(Food Poision) అయింది. సుమారు 50 మంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని స్థానిక పీహెచ్ సీకి తరలించారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే నిన్న ఓ హోటల్‌లో బజ్జీలు తిన్నామని, ఆ తర్వాత నుంచి వాంతులు, విరేచనాలు అయ్యాయని బాధితులు చెప్పారు. ఈ ఘటన ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించింది. హోటల్‌లో తిన్న బజ్జీల వల్లేనా..? మరేదైనా కారణాల ఉన్నాయా అనే కోణంలో అధికారులు పరిశీలన చేస్తున్నారు. మరోవైపు విషయం తెలియడంలో రాత్రికి రాత్రే హోటల్ మూసేసి యాజమాన్యం పరారైంది.
రంగంలోకి వైద్యారోగ్య శాఖ అధికారులు
సమాచారం తెలుసుకున్న వైద్యారోగ్య శాఖ వెంటనే రంగంలోకి దిగింది. పీహెచ్ సీలో చికిత్స పొందుతున్న బాధితులను అధికారులు పరామర్శించారు. బాధితులకు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని పీహెచ్‌సీ అధికారులను ఆదేశించారు. మరికొందరి లక్షణాలున్నాయా కోణంలో దుగ్గుదుర్రు గ్రామంలో విచారణ చేపట్టారు. ప్రత్యేక టీమ్ గ్రామంలో పర్యటిస్తోంది. హోటల్ లో వాడిన నూనె, ఇతర పదార్థాల నాణ్యత లోపం వల్లే ఇలా జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేశారు. హోటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.






