- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పీవీ సంస్కరణలు చిరస్మరణీయం: ఎమ్మెల్యే
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో పీవీ నరసింహారావు విగ్రహానికి పూల మాలలు వేసి ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి నివాళులు అర్పించారు.

దిశ, కందనూల్: మాజీ ప్రధానమంత్రి, భారతరత్న పీవీ నరసింహారావు దేశానికి అందించిన సేవలు ఆయన చేపట్టిన సంస్కరణలు చిరస్మరణీయమని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచకుళ్ల రాజేష్ రెడ్డి అన్నారు. పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ఆదివారం నాగర్‌కర్నూల్ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్‌లో ఆయన కాంస్య విగ్రహానికి నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేష్ రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశానికి పీవీ నరసింహారావు అందించిన సేవలు, సంస్కరణలు చిరస్మరణీయమని కొనియాడారు. భారతదేశ అభివృద్ధి పథంలో ఆయన పాత్ర ఎంతో గొప్పదన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర కుమార్, వైస్ చైర్మన్ బాదం రమేష్, కౌన్సిలర్లు అవంచ మాధవి, మొహ్మద్ నిజాముద్దీన్, పడిగే శంకర్, కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు జక్కా రాజు, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు హబీబ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజు పాల్గొన్నారు.






