డిసెంబర్లో చిరంజీవి–బాబి మూవీ.. సంక్రాంతి రేసు నుంచి తప్పుకోవడానికి కారణం అదేనా?

by Pulgam srinivas |

'మెగా 158' చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేసే అవకాశం ఉందని ఓ వార్త వైరల్ అవుతోంది.

డిసెంబర్లో చిరంజీవి–బాబి మూవీ.. సంక్రాంతి రేసు నుంచి తప్పుకోవడానికి కారణం అదేనా?
X

దిశ, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి - బాబి కొల్లి కాంబినేషన్‌లో 'మెగా 158' (వర్కింగ్ టైటిల్)గా తెరకెక్కుతున్న చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు ప్రధాన కారణం వీరి కాంబోలో వచ్చిన వాల్తేరు వీరయ్య చిత్రం బ్లాక్‌బస్టర్ విజయం సాధించడమే. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాను తొలుత వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ చిత్రాన్ని సంక్రాంతి రేసు నుంచి తప్పించి డిసెంబర్‌లో విడుదల చేయాలని నిర్మాతలు యోచిస్తున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాల్తేరు వీరయ్య సంక్రాంతి సీజన్‌లో విడుదలై ఘన విజయం సాధించడంతో, 'మెగా 158' కూడా అదే సీజన్‌లో వస్తుందని అభిమానులు భావించారు. కానీ విడుదల తేదీలో మార్పు ఉండొచ్చన్న ప్రచారం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

దీనిపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో సంక్రాంతి సీజన్‌లో కుటుంబ కథా చిత్రాలకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. అయితే ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాలను బట్టి చూస్తే 'మెగా 158' ఓ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్నట్లు అర్థమవుతుంది. అందుకే ఈ సినిమా జానర్‌కు డిసెంబర్ విడుదల మరింత అనుకూలంగా ఉంటుందని, ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించే అవకాశం ఉందని మేకర్స్ భావిస్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో, సినిమా విడుదల తేదీ ఎప్పుడు ప్రకటిస్తారో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. కాగా కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు.

Next Story