- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Dil Raju: ఆ మూడు సినిమాల విషయంలో నేను పెద్ద తప్పు చేశాను
'దిల్', 'ఆర్య', 'భద్ర' సినిమాల శాటిలైట్ హక్కులను కాలపరిమితి లేకుండా అమ్మేయడం తన పెద్ద తప్పు అని దిల్ రాజు వెల్లడించారు.

దిశ, వెబ్ డెస్క్: డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్‌ను ప్రారంభించి, నిర్మాతగా అంచెలంచెలుగా ఎదిగిన వారిలో దిల్ రాజు ఒకరు. 'దిల్' సినిమాతో ఆయన నిర్మాతగా కెరీర్‌ను ప్రారంభించారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కెరీర్ ప్రారంభంలో తాను చేసిన కొన్ని తప్పుల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. దిల్ రాజు మాట్లాడుతూ.. "నిర్మాతగా కెరీర్‌ను ప్రారంభించిన రోజుల్లో నిర్మించిన 'దిల్', 'ఆర్య', 'భద్ర' సినిమాల శాటిలైట్ హక్కులను ఎలాంటి కాలపరిమితి ఒప్పందం లేకుండానే విక్రయించాను. తర్వాత అలా చేయకూడదని నాకు అర్థమైంది. ఆ తప్పు తెలుసుకున్న తర్వాత 'బొమ్మరిల్లు' సినిమా నుంచి ప్రతి సినిమాకు 5 లేదా 10 సంవత్సరాల కాలపరిమితితోనే శాటిలైట్ హక్కుల ఒప్పందాలు చేసేవాడిని.
'దిల్' సినిమా శాటిలైట్ హక్కులకు రూ.35 లక్షలు, 'ఆర్య' సినిమాకు రూ.45 లక్షలు వచ్చాయి. కెరీర్ ప్రారంభంలో శాటిలైట్ హక్కుల విషయంలో నేను పెద్ద తప్పు చేశానని ఇప్పుడు అనిపిస్తోంది" అని దిల్ రాజు తెలిపారు. ఇక 'దిల్' సినిమాలో నితిన్ హీరోగా నటించగా, వి.వి. వినాయక్ దర్శకత్వం వహించారు. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన 'ఆర్య'కు సుకుమార్ దర్శకత్వం వహించగా, రవితేజ హీరోగా రూపొందిన 'భద్ర' చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. 'దిల్' చిత్రాన్ని మినహాయిస్తే, 'ఆర్య' మరియు 'భద్ర' సినిమాలతో సుకుమార్, బోయపాటి శ్రీను దర్శకులుగా పరిచయం కావడం విశేషం.






