- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మణప్పురం గోల్డ్ లోన్ నిర్వాకం.. బంగారం స్థానంలో నకిలీ గోల్డ్
అది పేరు గల సంస్థ.. చేసేది గోల్డ్ లోన్ బిజినెస్. నమ్మకమే పెట్టుబడిగా వ్యాపారం. అయితే అందులో పని చేసే కొందరు ఉద్యోగులు కక్కుర్తికి పాల్పడుతున్నారు. ...

దిశ, వెబ్ డెస్క్: అది పేరు గల సంస్థ.. చేసేది గోల్డ్ లోన్ బిజినెస్. నమ్మకమే పెట్టుబడిగా వ్యాపారం. అయితే అందులో పని చేసే కొందరు ఉద్యోగులు కక్కుర్తికి పాల్పడుతున్నారు. కస్టమర్లు తాకట్టు పెట్టిన బంగారాన్ని కొట్టేస్తున్నారు. ఇలాంటి ఘటన మణపురం గోల్డ్ లోన్ సంస్థలో జరగడం సంచలనంగా మారింది.
ద్రాక్షారామం బ్రాంచ్‌లో గోల్డ్ మాయం
కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం ద్రాక్షారామంలో మణప్పురం లోడ్ లోన్ సంస్థ వ్యాపారాలు సాగిస్తోంది. అవసరం నిమిత్తం ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి ఈ సంస్థలో కొందరు కస్టమర్లు డబ్బులు తీసుకున్నారు. అయితే 8 మంది కస్టర్లు తాకట్టు పెట్టిన బంగారం మాయం అయింది. అంతేకాదు ఆ బంగారం స్థానంలో నకిలీ నగులు పెట్టారు. మొత్తం 20 లక్షల విలువైన 151 గ్రాముల బంగారం మాయం అయింది. మాజీ మేనేజర్ నగేశ్ మోసం చేసినట్లు తేలింది. ఆడిట్ నిర్వహించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో మాజీ మేనేజర్ మగేష్‌పై కేసు నమోదు చేసింది.
ఉద్యోగం మానేసి చెన్నైకు నగేష్
అయితే ఆయన ఉద్యోగం మానేసి చెన్నై వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం నగేష్‌ను పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు 8 మంది కస్టమర్లు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని కోరారు. మణపురం గోల్డ్ లోన్ సంస్థను నమ్మి తమ బంగారం తాకట్టు పెడితే ఇలా చేస్తారా అని మండిపడుతున్నారు.






