పల్స్ పోలియో కార్యక్రమం.. ఆత్మకూరు పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌వో

by Jakkula.Mamatha |   (  Updated:2026-06-28 06:59:05  IST  )

జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి(డీఎంహెచ్‌వో) మనోహర్ సూచించారు.

పల్స్ పోలియో కార్యక్రమం.. ఆత్మకూరు పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌వో
X

దిశ, ఆత్మకూరు(ఎం): జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి(డీఎంహెచ్‌వో) మనోహర్ సూచించారు. ఆదివారం ఆత్మకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలియో బూత్‌ల నిర్వహణ, చిన్నారులకు చుక్కల పంపిణీ, రికార్డుల నిర్వహణను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఒక్క చిన్నారి కూడా మిగిలిపోకుండా క్షేత్రస్థాయిలో ప్రత్యేక దృష్టి సారించాలని, ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు అందించే చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బీసు ధనలక్ష్మి, ఉప సర్పంచ్ మజ్జిగ నరేష్ పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ పావని, సీహెచ్‌ఓ రాకేష్ సింగ్, సూపర్‌వైజర్ కళమ్మ, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story